ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jumbo Savari: మైసూర్ ప్యాలెస్‌లో ప్రజలకు ప్రవేశం లేదు

ABN, First Publish Date - 2021-10-15T17:33:19+05:30

కర్ణాటకలో తాజాగా 310 కరోనా కేసులు వెలుగుచూడటంతో మైసూర్ జంబో సవారీ కోసం అంబవిలాస్ ప్యాలెస్ లోకి ప్రవేశాన్ని మైసూర్ జిల్లా యంత్రాంగం నిషేధించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైసూర్ (కర్ణాటక): కర్ణాటకలో తాజాగా 310 కరోనా కేసులు వెలుగుచూడటంతో మైసూర్ జంబో సవారీ కోసం అంబవిలాస్ ప్యాలెస్ లోకి ప్రవేశాన్ని మైసూర్ జిల్లా యంత్రాంగం నిషేధించింది. దసరా ఉత్సవాల సందర్భంగా చాముండీశ్వరి విగ్రహాన్ని చాముండి కొండల నుంచి మైసూర్ ప్యాలెస్ కి ఊరేగింపుగా తీసుకువస్తారు. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఆంక్షల కారణంగా జంబో సవారీ కోసం అంబవిలాస్ ప్యాలెస్ ప్రాంగణంలోకి ప్రజల ప్రవేశాన్ని నిషేధిస్తూ మైసూర్ జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రజలు, పర్యాటకులు దసరా ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని చూడాలని మైసూర్ పోలీసు కమిషనర్ చంద్రగుప్త సూచించారు.


జంబో సవారీ కరోనా మహమ్మారి కారణంగా వరుసగా రెండవ సంవత్సరం ప్యాలెస్ ప్రాంగణానికే పరిమితం చేశారు.చాముండి కొండల నుంచి చాముండీశ్వరి విగ్రహాన్ని ఊరేగింపు తీసుకురానున్నారు.కొవిడ్ సాంకేతిక సలహా కమిటీ సిఫార్సుల ఆధారంగా జంబో సవారీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో కేవలం 500 మందికే అనుమతించాలని నిర్ణయించారు.ఆర్టీపీసీఆర్ ప్రతికూల రిపోర్టు ఉన్నఅధికారులనే ఊరేగింపునకు అనుమతించాలని నిర్ణయించారు. బెంగళూరు నగరంలో 148 కరోనా కేసులు నమోదైనాయి. కర్ణాటకలో మొత్తం యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 9,578కు చేరింది.దక్షిణ కన్నడలో 40 కరోనా కేసులు, మైసూరులో 27, హాసన్ జిల్లాలో 15, ఉత్తర కన్నడ జిల్లాలో 10 కేసులు నమోదైనాయి. 


Updated Date - 2021-10-15T17:33:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising