ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైసూరు దసరా ఉత్సవాల ఖర్చు రూ.5.42 కోట్లు

ABN, First Publish Date - 2021-11-03T16:40:37+05:30

కొవిడ్‌ కారణంగా అత్యంత సాదాసీదాగా నిర్వహించినప్పటికీ మైసూరు దసరా ఉత్సవాల నిర్వహణకు రూ.5.42 కోట్లు ఖర్చు అయ్యాయి. ఈ విషయాన్ని జిల్లా ఇన్‌చార్జ్‌ మం త్రి ఎస్‌టీ సోమశేఖర్‌ సో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కొవిడ్‌ కారణంగా అత్యంత సాదాసీదాగా నిర్వహించినప్పటికీ మైసూరు దసరా ఉత్సవాల నిర్వహణకు రూ.5.42 కోట్లు ఖర్చు అయ్యాయి. ఈ విషయాన్ని జిల్లా ఇన్‌చార్జ్‌ మం త్రి ఎస్‌టీ సోమశేఖర్‌ సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. దసరా ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.6 కోట్లు విడుదల చేయగా అందులో రూ. 58 లక్షలు మిగిలాయన్నారు. ఈ మొత్తాన్ని రాచనగరి మైసూరులో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఖర్చు చేస్తామన్నారు. ఆహ్వాన పత్రికల ముద్రణకు ఎక్కువగా ఖర్చు కావడం గమనార్హం. ఉత్సవాల్లో పా ల్గొన్న కళాకారులకు పారితోషికం రూపంలో రూ.1.03 కోట్లు చెల్లించగా వేదిక నిర్మాణం, విద్యుత్‌ అలంకరణకు రూ.93.80 లక్షలు ఖర్చు చేశారు. ఆహ్వాన పత్రికల ముద్రణ కోసం రూ.5.91 లక్షలు, కళాకారులకు రవాణా సదుపాయం కోసం రూ.29.16లక్షలు, జంబూ సవారీ కోసం రూ.37.50 లక్షలు, శకటాల నిర్మాణానికి రూ.18. 55లక్షలు ఖర్చు అయ్యాయన్నారు. 

Updated Date - 2021-11-03T16:40:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising