ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయావకాశాలు మాకే అనుకూలంగా ఉన్నాయి: పన్నీర్ సెల్వం

ABN, First Publish Date - 2021-03-05T21:23:49+05:30

అధికార అన్నాడీఎంకే అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితాలో కేవలం ఆరుగురు అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. అందులో సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఉన్నారు. సీఎం పళని స్వామి ఎడప్పాడి నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతున్నారు. ఇక డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కొద్ది రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలు తమకే అనుకూలంగా ఉన్నాయని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత ఓ పన్నీర్ సెల్వం అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఈసారి తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే గెలుస్తుందనే అంచనాలు ఉన్నట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఈ అంచనాలను కాదని విజయం తమదేనని అన్నాడీఎంకే నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


అధికార అన్నాడీఎంకే అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితాలో కేవలం ఆరుగురు అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. అందులో సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఉన్నారు. సీఎం పళని స్వామి ఎడప్పాడి నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతున్నారు. ఇక డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం బోడినాయకనూర్ నుంచే బరిలోకి దిగుతున్నారు. దీంతో వారిద్దరూ సిట్టింగ్ స్థానాల నుంచే బరిలోకి దిగుతున్నారన్నది స్పష్టమైపోయింది. ఇక మరో వైపు డి. జయకుమార్ (రాయపురం), సీవీ షణ్ముగం (విల్లుపురం), ఎస్పీ షణ్ముగనాథం (శ్రీవైకుంఠం), తేన్‌మోళి (నీలకొట్టై) నుంచి బరిలోకి దిగుతున్నారు.

Updated Date - 2021-03-05T21:23:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising