ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మురుడేశ్వర్‌పై ఉగ్రవాదుల కన్ను?

ABN, First Publish Date - 2021-11-24T17:58:24+05:30

కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మురుడేశ్వర్‌పై ఐసిస్‌ ఉగ్రవాదుల కన్ను పడినట్టు సోషల్‌ మీడియాలో కథనాలు వైరల్‌ అవుతున్నాయి. ఇందుకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వశాఖ నుంచి ఎలాంటి సంకేతాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                  - ముందుజాగ్రత్తగా భద్రత పెంపు 


బెంగళూరు: కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మురుడేశ్వర్‌పై ఐసిస్‌ ఉగ్రవాదుల కన్ను పడినట్టు సోషల్‌ మీడియాలో కథనాలు వైరల్‌ అవుతున్నాయి. ఇందుకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వశాఖ నుంచి ఎలాంటి సంకేతాలు లేనప్పటికీ ముందు జాగ్రత్తగా ఆలయ పరిసరాలలో భద్రతను పెంచారు. అరేబియా సముద్రానికి సమీపంలో ఉన్న హిందువుల అత్యంత పవిత్రస్థలమైన ఉత్తరకన్నడ జిల్లా భట్కళ్‌ తాలూకాలోని మురుడేశ్వర్‌కు దేశ విదేశాల నుంచి పర్యాటకులు, భక్తులు విచ్చేస్తుంటారు. సముద్రతీర ప్రాంతం కావడంతో ఈ పుణ్యక్షేత్రానికి ఆదరణ అధికంగా ఉంది. ఇక్కడి శివుడి భారీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. సోషల్‌ మీడియాలో ఇటీవల ఐసిస్‌ పేరిట వెలువడ్డ కథనాలలో ఇక్కడి మురుడేశ్వర్‌ ఆలయం ఫొటో, సగానికి విరిచిన శివుడి విగ్రహం ఫొటోలు ఉన్నాయి. మంగళవారం వైరల్‌ కావడంతో ఉత్తరకన్నడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. భట్కళ్‌లో గతంలో ఐసిస్‌ సానుభూతిపరులు అరెస్టయిన నేపథ్యంలో సహజంగానే ఈ వదంతులు కలకలం సృష్టిస్తున్నాయి. హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర మీడియాతో మాట్లాడుతూ మురుడేశ్వర్‌ ఆలయ పరిసర ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేసి నిఘాను మరింతగా పెం చామన్నారు. ఆలయం వద్ద అనుమానితులను గుర్తిస్తే తక్షణం అదుపులోకి తీ సుకోవాలని పోలీసులకు సూచించామన్నారు. 

Updated Date - 2021-11-24T17:58:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising