ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబానీ కుటుంబానికి బెదిరింపు కేసులో ఏటీఎస్, ఎన్ఐఏ దర్యాప్తు

ABN, First Publish Date - 2021-02-27T14:44:02+05:30

రిలయన్స్ దిగ్గజం ముకేశ్ అంబానీ కుటుంబానికి బెదిరింపు లేఖ వచ్చిన నేపథ్యంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దర్యాప్తునకు 10 ముంబై ప్రత్యేక పోలీసు బృందాలు

ముంబై (మహారాష్ట్ర): రిలయన్స్ దిగ్గజం ముకేశ్ అంబానీ కుటుంబానికి బెదిరింపు లేఖ వచ్చిన నేపథ్యంలో ఈ కేసులో ఉగ్రవాద కోణాన్ని పరిశోధించడానికి మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్(ఏటీఎస్), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అధికారులు రంగంలోకి దిగారు. పేలుడు పదార్థాలున్న కారును ముకేశ్ అంబానీ ఇల్లు అంటెల్లా వద్ద వదిలి ఆగంతకుడు పారిపోయిన ఘటనతో అప్రమత్తమైన ముంబై పోలీసులు హైప్రొఫైల్ కేసును ఛేదించడానికి యత్నిస్తున్నారు. ఉన్నతస్థాయి కేసు దర్యాప్తు కోసం ముంబై పోలీసులు 10 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. 


ఈ కేసును తప్పు దోవ పట్టించేలా నిందితులు స్పెల్లింగ్ తప్పిదాలతో బెదిరింపు లేఖను ముద్రించారని పోలీసులు గుర్తించారు. చేతిరాత నిపుణుల సహాయంతో ఎవరు రాశారనేది గుర్తించకుండా బెదిరింపు లేఖను ముద్రించారని ముంబై పోలీసులు చెప్పారు. ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలున్న కారును వదిలిన కేసులో 15 మంది అనుమానితులను ప్రశ్నించారు. వందలాది సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. దీనికోసం వాడిన రెండు కార్లను గుర్తించి ఇవి థానే నుంచి వచ్చాయని గుర్తించారు.కారు దొంగలను గుర్తించడంతోపాటు కారు వదిలిన స్థలంలో మొబైల్ డాటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. పేలుడుపదార్థాలు వదిలిన కారులోని వ్యక్తి ముకేశ్ అంబానీ ఇంటి బయట ఇన్నోవాలోకి ఎక్కి పారిపోయాడని పోలీసులు గుర్తించారు.

Updated Date - 2021-02-27T14:44:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising