ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంటీసీ బస్సుల్లో cc కెమెరాలు

ABN, First Publish Date - 2021-10-19T16:40:50+05:30

రోజురోజుకూ పెరిగిపోతున్న చోరీలు, మహిళలపై దౌర్జన్యాలు, అసాంఘిక శక్తుల చేతివాటానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు చెన్నై మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎంటీసీ) సిద్ధమైంది. ఇందులో భాగంగా చెన్నైలో నడుస్తున్న 2

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                      - త్వరలోనే ఏర్పాటు


ప్యారీస్‌(chennai): రోజురోజుకూ పెరిగిపోతున్న చోరీలు, మహిళలపై దౌర్జన్యాలు, అసాంఘిక శక్తుల చేతివాటానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు చెన్నై మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎంటీసీ) సిద్ధమైంది. ఇందులో భాగంగా చెన్నైలో నడుస్తున్న 2,400 బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎంటీసీ రోజుకు 3,365 బస్సులను పలు రూట్లలో నడుపుతుండగా, సుమారు 42 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళలు ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. మహిళా ప్రయాణికుల సంఖ్య రెండింతలు పెరగడంతో వారి భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎంటీసీ బస్సులలో సంఘ విద్రోహుల చర్యలకు అడ్డుకట్ట వేసే విధంగా సీసీ కెమెరాలు ‘నిర్భయ’ పథకం కింద తొలివిడతగా ఏర్పాటు చేయనున్నట్టు ఎంటీసీ అధికారులు తెలిపారు. తొలివిడతలో భాగంగా త్వరలో 2,400 బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కెమెరాలను ఎంటీసీ సాంకేతిక విభాగంతో పాటు చెన్నై పోలీసు కమిషనరేట్‌కు అనుసంధానం చేయనున్నట్టు అధికారులు తెలిపారు. దీనివల్ల సీసీ కెమెరాల్లో అసాంఘిక కార్యక్రమాలను గమనించే పోలీసులు ఎక్కడికక్కడ చర్యలకు ఉపక్రమించే అవకాశముంది. దానివల్ల రాష్ట్రంలో క్రైంరేటు తగ్గుముఖం పడుతుందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. 

Updated Date - 2021-10-19T16:40:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising