ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

13వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె.. 918 మంది సస్పెండ్

ABN, First Publish Date - 2021-11-11T01:12:45+05:30

ఆర్టీసీ కార్మికులు చేస్తునన సమ్మె పట్ల బాంబే హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతే కాకుండా కార్మికులంతా తిరిగి విధుల్లో చేరాలని ప్రభుత్వం విజ్ణప్తి చేసింది. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: నష్టాల్లో ఉన్న మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా ఆ సంస్థ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన చేస్తున్నారు. కాగా, విధులకు రాకుండా నిరసన చేస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వం భారీ స్థాయిలో వేటు వేస్తోంది. ఇప్పటి వరకు 918 మంది ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని 250 డిపోల్లో ఉన్న బస్సులు గత 13 రోజులుగా రోడ్డు ఎక్కడం లేదు. నిన్న మొన్నటి వరకు రెండు-మూడు డిపోల బస్సులు నడిపించినప్పటికీ బుధవారం నాటికి అవి కూడా పూర్తిగా సమ్మెలో చేరాయి.


కాగా, ఆర్టీసీ కార్మికులు చేస్తునన సమ్మె పట్ల బాంబే హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతే కాకుండా కార్మికులంతా తిరిగి విధుల్లో చేరాలని ప్రభుత్వం విజ్ణప్తి చేసింది. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ కార్మికులు తేల్చి చెప్పారు. తొందరలోనే అన్ని ఆర్టీసీ సంఘాలతో కలిసి ఒక వేదికను ఏర్పాటు చేసేందుకు కార్మికులు ప్రయత్నిస్తున్నారు.


ఈ విషయమై ఒక ఆర్టీసీ యూనియన్ నేత మాట్లాడుతూ ‘‘నవంబర్ 8 నుంచి మేం నిరసన చేస్తున్నాం. కానీ ప్రభుత్వం మా డిమాండ్‌ను పట్టించుకోవడం లేదు. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉంది. దీనిని ప్రభుత్వంలో విలీనం చేయకపోతే ప్రజా రవాణా అంతమై పోతుంది. ఇప్పటికే ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి మా డిమాండ్‌ను వెంటనే నెరవేర్చాలి’’ అని తెలిపారు.

Updated Date - 2021-11-11T01:12:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising