ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ నెలాఖరుకల్లా మధ్య ప్రదేశ్‌లో లక్ష యాక్టివ్ కేసులు: సీఎం చౌహాన్

ABN, First Publish Date - 2021-04-10T22:50:40+05:30

MPs active COVID19 case count may reach 1 lakh by April end says Chouhan...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఈ నెలాఖరుకల్లా కొవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు చేరే అవకాశం ఉందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ మరింత పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇవాళ జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘‘కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం చూస్తుంటే... ఈ నెలాఖరు కల్లా మధ్య ప్రదేశ్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు చేరే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌ సహా వివిధ చర్యలు చేపట్టి ఎలాగైనా ఈ పెరుగుదలను మధ్యలోనే నిలిపివేసేందుకు ప్రయత్నిస్తాం...’’ అని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి సమయానికి రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 30,486కి చేరుకోగా.. మొత్తం కేసుల సంఖ్య 3,27,220కి పెరిగింది. కేసులు ఒక్కసారిగా పెరగడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కొవిడ్ కేర్ సెంటర్లు తెరవాలని నిర్ణయించినట్టు సీఎం పేర్కొన్నారు. కొవిడ్ కేర్ సెంటర్ల కోసం ఆరోగ్య శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రాజేశ్ రాజోరా ఇప్పటికే ఇండోర్, భోపాల్ నగరాల్లో భవనాల కోసం అన్వేషిస్తున్నట్టు ఆయన  తెలిపారు. రాష్ట్రంలో వైద్యానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరాను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. 

Updated Date - 2021-04-10T22:50:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising