ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి ఈ రాష్ట్రాల్లో తెరుచుకోనున్న స్కూళ్లు!

ABN, First Publish Date - 2021-07-26T11:43:10+05:30

దేశంలో కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో కరోనా ఆంక్షల నుంచి మినహాయింపులు లభించాయి. రాజధాని ఢిల్లీలో నేటి నుంచి అన్ లాక్-8 గైడ్‌లైన్స్ అమలుకానున్నాయి. ఈ నేపధ్యంలో ఈరోజు నుంచి ఢిల్లీ మెట్రో 100 శాతం సామర్థ్యంతో పరుగులు తీయనుంది. ఇప్పటివరకూ మెట్రో 50 శాతం ప్రయాణికుల సామర్ధ్యంతోనే నడిచింది. మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో నేటి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. 


అయితే ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు తెరిచేందుకు ఇంకా అనుమతులు లభించలేదు. మధ్యప్రదేశ్‌లో ఈరోజు నుంచి 11, 12 తరగతుల పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఇదేవిధంగా గుజరాత్‌లోనూ నేటి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. 9, 10, 11 తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరుకానున్నారు. అయితే 50 శాతం విద్యార్థుల సామర్థ్యంతోనే స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఇక ఒడిశాలోనూ నేటి నుంచి10, 12 తరగతులు ప్రారంభం కానున్నాయి. అయితే 50 శాతం విద్యార్థులు మాత్రమే హాజరయ్యేందుకు వీలు కల్పించారు. నాగాలాండ్‌లో ఈరోజు నుంచి హయ్యర్ సెకెండర్ స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. అయితే వ్యాక్సిన్ వేయించుకున్న స్కూళ్ల టీచర్లు, స్టాఫ్ మాత్రమే పాఠశాలలకు రావాలనే నిబంధన విధించారు. కర్నాటకలో ఈరోజు నుంచి కాలేజీలు తెరుచుకోనున్నాయి. 

Updated Date - 2021-07-26T11:43:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising