ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా చికిత్స కోసం మధ్య ప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త పథకం

ABN, First Publish Date - 2021-05-08T03:24:49+05:30

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ‘‘ముఖ్యమంత్రి కొవిడ్ ఉపచార్ యోజన’’ పేరుతో సరికొత్త...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ‘‘ముఖ్యమంత్రి కొవిడ్ ఉపచార్ యోజన’’ పేరుతో సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని మూడు సెక్షన్లుగా విభజించినట్టు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ‘‘మొదటి సెక్షన్ కింద, రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల నిర్వహణలో ఉన్న ఆస్పత్రులు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో కొవిడ్-19 పేషెంట్లకు ఉచిత చికిత్స అందిస్తారు. రెండో సెక్షన్లో, ప్రయివేటు మెడికల్ కాలేజీలు నిర్వహిస్తున్న ఆస్పత్రుల్లో 20 శాతం ఐసీయూ/హెచ్‌డీయూలు, ఐసొలేషన్ బెడ్లు ఉచిత చికిత్స కోసం రిజర్వ్ చేయడం జరుగుతుంది..’’ అని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ పథకంలోని మూడో సెక్షన్‌లో, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కోసం ఆయుష్మాన్ పథకం కింద గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో 20 బెడ్లు రిజర్వ్ చేస్తారనీ.. ఆయుష్మాన్ కార్డులు ఉన్నవారు దీని కింద లబ్ధి పొందవచ్చునని సదరు అధికారి వెల్లడించారు. ‘‘ముఖ్యమంత్రి కొవిడ్ ఉపచార్ యోజన కింద ఆయుష్మాన్ కార్డుదారుల కోసం ధరలను కూడా ప్రభుత్వం సవరించింది..’’ అని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-08T03:24:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising