ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీ వర్షాలతో మధ్యప్రదేశ్ అల్లకల్లోలం... 1171 గ్రామాలపై తీవ్ర ప్రభావం!

ABN, First Publish Date - 2021-08-04T14:53:34+05:30

మధ్యప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా భారీ వర్షాల ప్రభావం రాష్ట్రంలోని నాలుగు జిల్లాలపై తీవ్రంగా ఉంది. తాజాగా శివపురిలో నీటిలో చిక్కుకున్న ముగ్గురిని రెస్క్యూ టీం కాపాడింది. మరో ఐదుగురిని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో ఎంపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారుతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. 


సహాయక చర్యలను వేగవంత చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని శివపురి, ష్యోపూర్, గ్వాలియర్, దాతియా జిల్లాలలోని 1,171 గ్రామాలు వరదముంపునకు గురయ్యాయి. 200 గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ప్రస్తుతం ముంపు ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వరద బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-08-04T14:53:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising