ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యోగిపై మోదీ చమత్కారం

ABN, First Publish Date - 2021-12-18T22:10:31+05:30

షాజహాన్‌పూర్‌: ఉత్తర ప్రదేశ్ షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ప్రశంసలు కురిపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాజహాన్‌పూర్‌: ఉత్తర ప్రదేశ్ షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ప్రశంసలు కురిపించారు. యూపీ ప్లస్ యోగి ఉపయోగి అవుతుందంటూ చమత్కరించారు. షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు శనివారం శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నిర్మిస్తున్న ఆధునిక మౌలిక సదుపాయాల వల్ల ఉత్తర ప్రదేశ్ త్వరలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా గుర్తింపు పొందుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 






రాష్ట్రంలోని ఎక్స్‌ప్రెస్‌వేల నెట్‌వర్క్, నిర్మితమవుతున్న నూతన విమానాశ్రయాలు, రైలు మార్గాలు ప్రజలకు అనేక వరాలను తీసుకొస్తున్నాయని తెలిపారు. 594 కిలోమీటర్ల నిడివిగల ఈ ఎక్స్‌ప్రెస్‌వే కోసం రూ.36,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తామని మోదీ తెలిపారు. ప్రస్తుతం ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేగా గంగా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మితమవుతుంది. దీనిని 8 లేన్లకు విస్తరించవచ్చు. దీనిలో 3.5 కిలోమీటర్ల ఎయిర్ స్ట్రిప్ కూడా ఉంది. అత్యవసర సమయంలో భారత వాయు సేన విమానాలు ఇక్కడ దిగి, ఇక్కడి నుంచి బయల్దేరడానికి అవకాశం ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే వద్ద ఓ పారిశ్రామిక నడవను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు.    

Updated Date - 2021-12-18T22:10:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising