ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ పర్యటన నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో హడావుడి

ABN, First Publish Date - 2021-06-21T21:59:33+05:30

జమ్మూ కశ్మీర్‌కు మళ్లీ పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వనున్నారన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందుగా జమ్మూ కశ్మీర్‌లోని నేతలతో స్వయంగా చర్చలు జరిపి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో తొందరలో సమావేశం కానున్న నేపధ్యంలో తమ పార్టీ నేతలతో విస్తృత సమావేశాలు నిర్వహించనున్నారు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫారూఖ్ అబ్దుల్లా. మంగళవారం, బుధవారం పార్టీ నేతలతో చర్చలు జరిపిన అనంతరం.. జమ్మూ కశ్మీర్ అంశంపై ప్రధానితో చర్చించనున్నట్లు ఆ పార్టీ నేత నాసిర్ అస్లామ్ వాని తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని విషయాలను బుధవారం సాయంత్రం స్వయంగా ఫారూఖ్ అబ్దుల్లాయే మీడియాతో పంచుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.


జమ్మూ కశ్మీర్‌కు మళ్లీ పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వనున్నారన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందుగా జమ్మూ కశ్మీర్‌లోని నేతలతో స్వయంగా చర్చలు జరిపి ఓ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. తొందరలోనే జమ్మూ కశ్మీర్‌లోని నేతలను ప్రధాని కలుసుకోనున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లోని పార్టీలు తన నేతలు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి. కశ్మీర్ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని బలమైన గొంతుక వినిపించానే దృక్పథంలో అక్కడి పార్టీలు ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2021-06-21T21:59:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising