ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్విట్టర్‌లో మరో మైలు రాయి చేరిన మోదీ

ABN, First Publish Date - 2021-07-30T02:15:06+05:30

ఇక ప్రపంచంలో అతి ఎక్కువ మంది ఫాలోవర్ల జాబితాలో మోదీ 11వ స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (12.9 కోట్ల ఫాలోవర్లు) ఉన్నారు. ఇక ఇండియా విషయానికి వస్తే మోదీ తర్వాతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన అతి తక్కువ నేతల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకరు. ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఆయన ఎప్పుడూ ప్రజలకు చేరువలో ఉండాలనుకుంటారు. దానికి సోషల్ మీడియాను విస్తృతంగా వాడుతుంటారు. ఇక సోషల్ మీడియా సంస్థల్లో దిగ్గజమైన ట్విట్టర్‌లో అయితే మరింత యాక్టివ్‌గా ఉంటారు. చాలా కాలంగా అతి ఎక్కువ ఫాలోవర్లు కలిగిన భారతీయుడిగా ముందంజలో ఉన్న మోదీ.. తాజాగా మరో మైలు రాయిని అధిగమించారు. తాజాగా ఆయన ఫాలోవర్ల సంఖ్య 7 కోట్లకు (70 మిలియన్లు) చేరింది.


ఇక ప్రపంచంలో అతి ఎక్కువ మంది ఫాలోవర్ల జాబితాలో మోదీ 11వ స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (12.9 కోట్ల ఫాలోవర్లు) ఉన్నారు. ఇక ఇండియా విషయానికి వస్తే మోదీ తర్వాతి స్థానంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఉన్నారు. ఆయన ఫాలోవర్ల సంఖ్య 4.5 కోట్లు. ఇక మూడో స్థానంలో పీఎంవో ఉండడం విశేషం. పీఎంవోను 4.3 కోట్ల మంది ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు.


2009, జనవరిలో మోదీ ట్విట్టర్‌లో ఖాతా తెరిచారు. గడిచిన 11 ఏళ్లలో ఆయన ఏడు కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకోవడం గమనార్హం. కాగా ఆయన 2,350 మందిని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు. దేశంలోని మరే ఇతర రాజకీయ ప్రముఖులు ట్విట్టర్ ఫాలోవర్ల విషయంలో మోదీకి దరిదాపుల్లో కూడా లేరు.

Updated Date - 2021-07-30T02:15:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising