ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుతిన్‌తో సమావేశం: హైదరాబాద్ భవన్‌కు చేరుకున్న మోదీ

ABN, First Publish Date - 2021-12-06T23:15:27+05:30

రక్షణ రంగంలో పెట్టుబడులు, ఆయుధాల కొనుగోలులో కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు భారత్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్-400 మరింత వేగంగా అందించాలని రష్యాన్ భారత్ కోరే అవకాశం ఉన్నట్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం నిమిత్తం సోమవారం దేశ రాజధాని న్యూఢిల్లీలోని హైదరాబద్‌ భవన్‌కు చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. చిరకాల మిత్రదేశమై రష్యాతో భారత్‌ కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలపడేలా ఈ భేటీ జరుగనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రక్షణ, పర్యావరణ మార్పులు, వాణిజ్యం సహా ఇతర రంగాలకు చెందిన 10 ఒప్పందాలపై ఇరువురు సంతకాలు చేయనున్నారు. ఇక ఇరు దేశాల రక్షణ శాఖ, విదేశాంగ వ్యవహారాల మంత్రులు కూడా ముఖాముఖిగా సమావేశం కానున్నారు.


రక్షణ రంగంలో పెట్టుబడులు, ఆయుధాల కొనుగోలులో కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు భారత్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్-400 మరింత వేగంగా అందించాలని రష్యాన్ భారత్ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మోదీతో భేటీ తర్వాత మంగళవారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు పుతిన్‌ రష్యాకు తిరుగు పయనమవుతారు. ఇక పుతిన్‌ గౌరవార్థం మోదీ విందు ఇవ్వనున్నారు. భారత్‌-రష్యా మధ్య ఇప్పటికే 20సార్లు వార్షిక సదస్సులు జరిగాయి. ప్రస్తుతం జరగనున్నది 21వ సమావేశం. కాగా, ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం.. ఈరోజు కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అనంతరం రాత్రి 9:30 గంటలకు పుతిన్ తిరిగి రష్యా బయలుదేరనున్నారు.



Updated Date - 2021-12-06T23:15:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising