ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ తక్కువ మాట్లాడతారు, ఎక్కువ వింటారు : అమిత్ షా

ABN, First Publish Date - 2021-10-10T20:53:32+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓపిక ఎక్కువ అని సంసద్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓపిక ఎక్కువ అని సంసద్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఏ సమావేశంలోనైనా ఆయన చాలా తక్కువగా మాట్లాడతారని, ఇతరులు చెప్పే విషయాలను చాలా సహనంతో వింటారని, ఆ విధంగా వినగలిగేవారిని తాను ఎన్నడూ చూడలేదని తెలిపారు. మంచి సలహాలకు ఆయన ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. 


నరేంద్ర మోదీ ఓ పరిపాలకునిగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమిత్ షా ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు. మోదీ నిరంకుశంగా నిర్ణయాలు తీసుకుంటారా? అని అడిగినపుడు అమిత్ షా స్పందిస్తూ, సమావేశాల్లో ఆయన చాలా తక్కువగా మాట్లాడతారని, ఇతరులు చెప్పే విషయాలను చాలా సహనంతో వింటారని, ఆ విధంగా వినగలిగేవారిని తాను ఎన్నడూ చూడలేదని తెలిపారు. మంచి సలహాలకు ఆయన ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు.  మోదీపై పడని నింద అంటూ లేదన్నారు. అయితే ఆయన వీటన్నిటినీ అధిగమించడానికి కారణం యావత్తు ప్రతిపక్షం ఆయనను బలోపేతం చేయడమేనని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని ఆయన సాధించారన్నారు. ఆయన తీసుకునే నిర్ణయాలు దేశం కోసమని, ఆ నిర్ణయం వల్ల ఆయన పొందేదేమీ ఉండదని ప్రజలకు తెలుసునన్నారు. ఈ కారణంగానే ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా ప్రజలు ఆయనను క్షమించారని తెలిపారు. 


భారత దేశ ప్రధాన మంత్రుల్లో మోదీ తప్ప ఇతరులెవరూ భారత దేశానికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే సత్తా ఉందని చెప్పలేదన్నారు. ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 11వ స్థానం నుంచి 6వ స్థానానికి చేరిందని, త్వరలో 5వ స్థానానికి చేరుతుందని చెప్పారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా త్వరలో మారుతుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. 


Updated Date - 2021-10-10T20:53:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising