ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని Modi కోసం కాశీలో ప్రత్యేక పూజలు

ABN, First Publish Date - 2021-11-28T17:28:23+05:30

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని తమిళనాడులో ‘ఇంటింటికీ వెళ్దాం... మనసులు దోచుకుందాం’ పేరిట కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మూడవ విడతగా స్థానిక థౌజండ్‌ లైట్స్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై): ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని తమిళనాడులో ‘ఇంటింటికీ వెళ్దాం... మనసులు దోచుకుందాం’ పేరిట కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మూడవ విడతగా స్థానిక థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతం నుంచి వెళ్లిన 71 మంది భక్తుల బృందం శనివారం ఉదయం గంగా నది తీరంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించింది. కాశి యాత్ర ఏర్పాట్లను గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ మాజీ జోన్‌ ఛైర్మెన్‌, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది వి. గిరినాథ్‌ చేపట్టడంతో పాటు కాశి క్షేత్రంలో మోదీ జన్మదిన వేడుకల్లో కూడా పాల్గొన్నారు. కేదార్‌నాథ్‌ ఘాట్‌, గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం కాశి విశ్వనాథ ఆలయంలో మోదీ పేరుతో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అదే విధంగా ఆ క్షేత్రంలో కొలువుదీరిన కాలభైరవుడికి మహా జన్మాష్టమి సందర్భంగా సుగంధద్రవ్యాలతో అభిషేకపూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ఉత్తరప్రదేశ్‌ బీజేపీ అధికార ప్రతినిధి ఉమే్‌షసింగ్‌, రైల్వే శాఖ మాజీ జనరల్‌ మేనేజర్‌ రాంజీ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గిరినాథ్‌ మాట్లాడుతూ... దృఢమైన, స్థిరమైన మనస్సుతో, నియమనిష్టలతో మోక్షసాధనకు ప్రయత్నం చేయాలని సూచించారు. కాశి, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించడం కూడా భగవంతుడి కృప అని, ఆధ్యాత్మికత భయాన్ని పోగొడుతుందని గిరినాథ్‌ తెలిపారు.

Updated Date - 2021-11-28T17:28:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising