ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం శుభవార్త.. మార్చి వరకూ ఉచిత రేషన్ స్కీమ్‌ పొడిగింపు

ABN, First Publish Date - 2021-11-24T21:40:16+05:30

కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎం-జీకేఏవై) పథకం కింద ఇస్తున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎం-జీకేఏవై) పథకం కింద ఇస్తున్న ఉచిత రేషన్ స్కీమ్‌ను వచ్చే ఏడాది వరకూ పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ బుధవారంనాడు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ మీడియాకు తెలిపారు. గత ఏడాది కోవిడ్ మహమ్మారి తీవ్రం కావడంతో ప్రజల ఆర్థిక కష్టాలను దృష్టిలో ఉంచుకుని పీఎంజీకేఏవై స్కీమ్ కింద ఉచిత రేషన్ అందజేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కాగా, ఇటీవల పరిస్థితులు తిరిగి మెరుగుపడటంతో నవంబర్ 30వ తేదీ నుంచి ఉచిత రేషన్ పంపిణీని నిలిపివేయనున్నట్టు గత నవంబర్ 5న ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో పథకాన్ని పొడిగించాలని 'రైట్ టు ఫుడ్' కార్యకర్తలు సహా పలు పార్టీలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర క్యాబినెట్ వచ్చే ఏడాది మార్చి వరకూ పథకాన్ని పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2021-11-24T21:40:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising