ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ప్రధాని ఫేక్ ఫొటో

ABN, First Publish Date - 2021-09-29T23:08:01+05:30

అయితే ఆశ్చర్యం వెంబడే కొన్ని అభ్యంతరకరమైన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయి. సాధారణంగా ప్రధాని వెంట కెమెరామెన్లు తప్పని సరిగా ఉంటారని, ఆయన ఏం పని చేసినా కెమెరాను దృష్టిలో పెట్టుకునే చేస్తారని విమర్శలు మోదీపై అనేకం ఉన్నాయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆదివారం రాత్రి 8:30 గంటలకు ప్రధానమంత్రి నరంద్రమోదీ ఉన్నపళంగా సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణం వద్ద కనిపించారు. అప్పటికి ఆయన అమెరికా పర్యటన ముగించుకుని వచ్చి 24 గంటలు కూడా పూర్తి కాలేదు. ప్రధాని ఈ ఆకస్మిక పర్యటనపై అక్కడి అధికారులే కాదు, దేశ వ్యాప్తంగా చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గంటకు పైగా జరిగిన మోదీ పర్యటనపై అనేక మంది సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.


అయితే ఆశ్చర్యం వెంబడే కొన్ని అభ్యంతరకరమైన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయి. సాధారణంగా ప్రధాని వెంట కెమెరామెన్లు తప్పని సరిగా ఉంటారని, ఆయన ఏం పని చేసినా కెమెరాను దృష్టిలో పెట్టుకునే చేస్తారని విమర్శలు మోదీపై అనేకం ఉన్నాయి. అయితే ఇలాంటిదే ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోదీ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ పరిశీస్తుండగా ఒక ఫొటోగ్రాఫర్ కింద పడుకుని ఫొటో తీస్తున్నట్లు (ఫొటోలో రెండవ వైపుది) ఉన్న ఫొటోను నెటిజెన్లు షేర్ చేస్తూ మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.


అయితే వాస్తవానికి అది తప్పుడు ఫొటో అని నెట్టింట్లో దొరికిన ఒక ఫొటోగ్రాఫర్ ఫొటోను మోదీ ఫొటోలో ఫొటోషాప్‌ ద్వారా ఇరికించి సోషల్ మీడియాలోకి వదిలారు. కొంత మంది తెలియక, కొంత తెలిసి కూడా ఈ ఫొటోను షేర్ చేస్తూ పోయారు. దీంతో ప్రధాని ఫేక్ ఫొటో ఎక్కువ మంది జనాలకు చేరింది.

Updated Date - 2021-09-29T23:08:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising