ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ ర్యాలీలు తీస్తారు, మాకు అనుమతి ఇవ్వరా?: మెహబూబా ముఫ్తీ

ABN, First Publish Date - 2021-12-13T01:44:41+05:30

ఈ విషయమై ఆదివారం ముఫ్తీ మాట్లాడుతూ ‘‘కొవిడ్ సాకు చూపించి జమ్మూ కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ మా ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. మాకు మాత్రమే ఎందుకు ఈ నిబంధనలు? దేశంలోని ఇతర పార్టీలకు ఇవి ఎందుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: తమ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహతలపెట్టిన కార్యక్రమానికి అనుమతి నిరాకరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత మెహబూబా ముఫ్తీ. కొవిడ్ తీవ్రత, భద్రతా కారణంగా ర్యాలీకి అనుమతి ఇవ్వలేమని జమ్మూ కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టం చేసిన నేపథ్యంలో ముఫ్తీ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వేల మందితో పెట్టే మీటింగ్‌లకు, దేశంలోని ఇతర పార్టీలకు కొవిడ్ కలగని ఇబ్బంది తమకే ఎందుకు వస్తోందని ప్రశ్నించారు.


ఈ విషయమై ఆదివారం ముఫ్తీ మాట్లాడుతూ ‘‘కొవిడ్ సాకు చూపించి జమ్మూ కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ మా ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. మాకు మాత్రమే ఎందుకు ఈ నిబంధనలు? దేశంలోని ఇతర పార్టీలకు ఇవి ఎందుకు వర్తించవు? ర్యాలీకి వచ్చే వందలాది యువకులను అడ్డుకున్నారు. వారిని కొట్టారు. చాలా మంది బట్టలు కూడా చినిగిపోయాయి. ఎందుకు మాపై ఇంత వివక్ష? ఎందుకు మాపై ఇంత ధ్వేషం?’’ అని ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-12-13T01:44:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising