ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ బెంగాల్ టూర్ క్యాన్సిల్.... ఇందుకేనా?

ABN, First Publish Date - 2021-04-22T23:21:57+05:30

ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్ టూర్ రద్దైంది. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్ టూర్ రద్దైంది. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ షెడ్యూల్ ప్రకారం శుక్రవారం బెంగాల్‌లో పర్యటించాల్సింది ఉంది. అయితే కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని, అందుకే బెంగాల్‌ టూర్‌ను రద్దు చేసుకున్నట్లు మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘‘కరోనా పరిస్థితిని సమీక్షించడానికి శుక్రవారం అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ కారణంగానే బెంగాల్‌కు నేను వెళ్లడం లేదు’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 


బెంగాల్‌లో ఇప్పటికే 6 విడతల ఎన్నికలు జరిగాయి. మరో రెండు విడతలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించాల్సి ఉంది. అయితే కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో భారీ బహిరంగ సభలు నిర్వహించరాదని బెంగాల్ బీజేపీ నిర్ణయించింది. ఎన్నికల సభల్లో 500 మందికి మించి ఉండరాదని నిర్ణయించుకుంది. ప్రధాని మోదీ సహా స్టార్ క్యాంపెయినర్లు అంతా ఈ చిన్న చిన్న సభలనుద్దేశించే ప్రసంగిస్తారని ఇటీవలే బెంగాల్ బీజేపీ ప్రకటించింది. అటు రెండు రోజుల క్రితం బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఫోన్ చేస్తే, మోదీ లిఫ్ట్ చేయలేదని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి విమర్శలకు తావివ్వరాదని మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం.








Updated Date - 2021-04-22T23:21:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising