తమిళనాడు పోల్స్.. అభ్యర్థుల జాబితా విడుదల చేసిన కమల్ పార్టీ
ABN, First Publish Date - 2021-03-13T00:01:40+05:30
సినిమా హీరోగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న తమిళ నటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి
చెన్నై: సినిమా హీరోగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న తమిళ నటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించి అప్పట్లో సంచలనమే సృష్టించారు. ఆ తర్వాత మరో ప్రముఖ నటుడు రజనీకాంత్ కూడా రాజకీయ అరంగేట్రంపై ఊగిసలాడి చివరికి రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించారు. మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీతో రాజకీయ పార్టీని స్థాపించిన కమల్ తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న కమల్ తాజాగా 43 మంది అభ్యర్థులతో కూడిన మరో జాబితాను ప్రకటించారు. మాజీ ఐఏఎస్ అధికారి సంతోష్‌బాబుకు వేలచెరి స్థానాన్ని కేటాయించారు.
శరత్ కుమార్ సారథ్యంలోని ఆల్ ఇండియా సమథువ మక్కల్ కచ్చి (ఏఐఎస్ఎంకే), లోక్‌సభ ఎంపీ పారివేంధర్‌కు చెందిన ఇండియా జననాయక కచ్చి (ఐజేకే)తో కలిసి ఎంఎన్ఎం పోటీ చేస్తోంది. మొత్తం 234 స్థానాలకు గాను 154 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు కమల్ ఇది వరకే ప్రకటించారు.
తమిళనాడు అసెంబ్లీకి వచ్చే నెల 6న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఓట్లను లెక్కిస్తారు. తమిళనాడులోని ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం మే 24తో ముగుస్తుంది.
Updated Date - 2021-03-13T00:01:40+05:30 IST