ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mlc బరిలో అత్యధికులు కోటీశ్వరులే...

ABN, First Publish Date - 2021-11-25T16:39:55+05:30

స్థానిక సంస్థల నుంచి విధానపరిషత్‌కు డిసెంబరు 10న జరగనున్న ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థుల్లో అత్యధికులు కోటీశ్వరులే కావడం విశేషం. ఈ మేరకు అభ్యర్థులు నామినేషన్‌ పత్రాల్లో తమ ఆస్తుల వివరాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                  - నామినేషన్‌ పత్రాల్లో ఆస్తుల వివరాల ప్రకటన


బెంగళూరు: స్థానిక సంస్థల నుంచి విధానపరిషత్‌కు డిసెంబరు 10న జరగనున్న ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థుల్లో అత్యధికులు కోటీశ్వరులే కావడం విశేషం. ఈ మేరకు అభ్యర్థులు నామినేషన్‌ పత్రాల్లో తమ ఆస్తుల వివరాలు ప్రకటించారు. బెంగళూరు నగర జిల్లా నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన హెచ్‌ఎస్ గోపీనాథ్‌ రిటర్నింగ్‌ అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో తన వద్ద రూ.42.40 కోట్ల స్థిరాస్తి, రూ.5.44 కోట్ల చరాస్తి ఉన్నట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన యూసుఫ్‌ షరీఫ్‌ (కేజీఎఫ్‌ బాబు) తన వద్ద రూ.1,743 కోట్ల స్థిరాస్తి ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో 97.98 కోట్ల స్థిరాస్తి కాగా రూ.1,643.59 కోట్ల చరాస్తి ఉన్నట్టు పేర్కొన్నారు. అన్నట్టు యూసుఫ్‌ షరీఫ్‌ కేవలం 5వ తరగతి వరకు మాత్రమే చదివారు. చిత్రదుర్గ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి బీ సోమశేఖర్‌ తన వద్ద రూ.116 కోట్ల ఆస్తి ఉందని, భార్య పేరిట రూ.23 కోట్ల ఆస్తి ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో రూ.35 కోట్లు చరాస్తి కాగా రూ.80 కోట్లు స్థిరాస్తి. 5 బ్యాంకులలో కలిపి రూ.6.32 కోట్లు డిపాజిట్‌లుగా ఉంచినట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. బళ్లారిలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎచరెడ్డి సతీశ్‌ తన, కుటుంబ సభ్యుల పేరిట రూ.93.09 కోట్ల చరాస్తి, రూ.43.99 కోట్ల స్థిరాస్తి ఉన్నట్టు పేర్కొన్నారు. రంగంలో ఉన్న అభ్యర్థులు దాదాపు తమకు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లలో ప్రస్తావించారు. నామినేషన్‌ దాఖలు చేసిన సమయంలోనే మొత్తం కుటుంబ సభ్యుల ఆస్తి వివరాలు తప్పనిసరిగా సమర్పించాలన్న నిబంధన అమలులో ఉన్న సంగతి తెలిసిందే. 

Updated Date - 2021-11-25T16:39:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising