ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mla చేయి నరికేస్తా...!

ABN, First Publish Date - 2021-11-30T16:41:25+05:30

‘అన్నాడీఎంకే ఎమ్మెల్యే చేయి నరికేస్తా’నని ప్ల కార్డుతో ఓ వ్యక్తి రావడం కలకలం రేపింది. తిరుప్పూర్‌ కనకం పాళయం సమీపం నాదంపాళయానికి చెందిన నాగ కుమార్‌(50) వేలుస్వామి ఇంట్లో అద్దెకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                          - కార్డుతో కలెక్టరేట్‌కు వచ్చిన వ్యక్తి


పెరంబూర్‌(చెన్నై): ‘అన్నాడీఎంకే ఎమ్మెల్యే చేయి నరికేస్తా’నని ప్ల కార్డుతో ఓ వ్యక్తి రావడం కలకలం రేపింది. తిరుప్పూర్‌ కనకం పాళయం సమీపం నాదంపాళయానికి చెందిన నాగ కుమార్‌(50) వేలుస్వామి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. జూన్‌లో నాగకుమార్‌ ఇంట్లోని వస్తువులు చోరీకి గురయ్యాయి. ఈ విషయమై నాగ కుమార్‌ పెరుమానల్లూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఇంటి యజమానిని అదుపులోకి తీసు కొని విచారించారు. ఆ సమయంలో తిరుప్పూర్‌ ఉత్తరం అన్నాడీఎంకే ఎమ్మెల్యే విజయకుమార్‌, ఇంటి యజమానిని అరెస్ట్‌ చేయొద్దని పోలీసులకు చెప్పినట్టు నాగకుమార్‌ ఆరోపిస్తున్నారు. అదే సమయంలో ఫిర్యాదు వాపసు తీసుకుంటే వస్తువులు తిరిగి ఇప్పిస్తామని పోలీసులు చెప్పిన మాటలు నమ్మిన నాగకుమార్‌ సెప్టెంబరు 30వ తేది ఫిర్యాదు వెనక్కి తీసుకున్నాడు. నెలరోజులు గడిచినా వస్తువులు ఇప్పించకపోవడంతో ఆగ్రహించిన నాగకుమార్‌, ఇందుకు ఎమ్మెల్యే కారణమని ఆరోపిస్తూ, ఆయన చేతిని నరికివేస్తాననే ప్ల కార్డుతో కలెక్టరేట్‌కు వచ్చాడు. దీంతో, ఎమ్మెల్యేను బెదిరించిన నాగకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Updated Date - 2021-11-30T16:41:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising