ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఏఏ రద్దు కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టిన స్టాలిన్

ABN, First Publish Date - 2021-09-08T20:23:07+05:30

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని బుధవారం ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ, 2019లో పార్లమెంటు ఆమోదించిన సిటిజన్‌షిప్ సవరణ చట్టం రాజ్యాంగంలో పేర్కొన్న సెక్యులర్ సిద్ధాంతాలకు అనుగుణంగా లేదని, దేశంలోని మత సామరస్యానికి ఏమాత్రం దోహదకారి కాదని సభ అభిప్రాయపడుతోందన్నారు. ఆరీత్యా దేశంలోని ఐక్యత, మతసామరస్యాన్ని కాపాడేందుకు, రాజ్యాంగం పేర్కొన్న సెక్యులర్ సిద్ధాంతాలను పరిరక్షించేందుకు సీఏఏను రద్దు చేయాలని సభ కోరుతున్నట్టు పేర్కొన్నారు. వేధింపులకు గురైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్థాన్‌లకు చెందిన హిందూ, సిక్కు, జైన్, బుధ్ధ, పార్సీ, క్రిష్టియన్లకు భారత పౌరసత్వాన్ని కల్పించేందుకు సీఏఏ అనుమతిస్తోంది. సీఏఏ అమలును విపక్ష పార్టీలు, వివిధ సంస్థలు వ్యతిరేకిస్తున్నారు.

Updated Date - 2021-09-08T20:23:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising