ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amith shsha తో ఫోన్లో మాట్లాడిన మిజోరాం సీఎం

ABN, First Publish Date - 2021-08-01T17:43:44+05:30

మిజోరాం సీఎం జోరమతంగ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఫోన్లో సంభాషించారు. తదనంతరం అసోం ముఖ్యమంత్రి హిమంత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గౌహతి : మిజోరాం సీఎం జోరమతంగ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఫోన్లో సంభాషించారు. తదనంతరం అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మతో కూడా ఫోన్లో సంభాషించారు. అసోం, మిజోరాం రాష్ట్రాల మధ్య సరిహద్దు ఘర్షణ చెలరేగుతున్న నేపథ్యంలో  ఈ సంభాషణకు ప్రాధాన్యమేర్పడింది. పరిస్థితి చేజారకుండా ఉండేందుకు  ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని సీఎం జోరమతంగా విజ్ఞప్తి చేశారు. ‘‘కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఫోన్లో సంభాషించా. అసోం సీఎంతో కూడా సంభాషించా. అర్థవంతమైన చర్చల ద్వారా సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాం’’ అని మిజోరాం సీఎం జోరమతంగ పేర్కొన్నారు. 

వెనక్కి తగ్గనున్న మిజోరాం ప్రభుత్వం?

ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో మిజోరాం ప్రభుత్వం అసోం సీఎం హిమంత విశ్వశర్మపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అయితే పరిస్థితులు కాస్త చల్లబడటంతో దీనిని ఉప సంహరించుకునే దిశగా మిజోరాం ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై మిజోరాం సీఎస్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఎఫ్‌ఐఆర్ విషయం సీఎం జోరమతంగకు తెలియదు. నాకు కూడా ఈ విషయం తెలియదు. ఈ విషయంపై పునరాలోచించుకోవాలని సీఎం నాతో అన్నారు. ఈ విషయంపై అధికారులతో సమీక్షిస్తా’’ అని మిజోరాం సీఎస్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-01T17:43:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising