ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగ్గీ వాసుదేవ్‌ ఓ కమర్షియల్‌ ఆపరేటర్‌: మంత్రి త్యాగరాజన్‌

ABN, First Publish Date - 2021-05-19T07:53:07+05:30

తమిళనాడు ఆర్థిక మంత్రి పి.త్యాగరాజన్‌కు, ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఈషా ఫౌండేషన్‌కు మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, మే 18 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు ఆర్థిక మంత్రి పి.త్యాగరాజన్‌కు, ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఈషా ఫౌండేషన్‌కు మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్‌ను ఒక కమర్షియల్‌ ఆపరేటర్‌గా, ప్రచార పిచ్చోడిగా మంత్రి త్యాగరాజన్‌ అభివర్ణించారు. అంతేకాకుండా డబ్బు సంపాదించేందుకు వాసుదేవ్‌ మరో కోణంలో ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తనను తాను ఒక దేవుడిగా ప్రచారం చేసుకునే జగ్గీ వాసుదేవ్‌ మహాశివరాత్రి జాగారం పేరుతో శివరాత్రి టిక్కెట్లను రూ.5 లక్షలు, రూ.50 వేలు, రూ.5 వేలకు విక్రయిస్తున్నారనీ, ఇది దైవభక్తి కలిగిన మనిషికి గుర్తింపా? అని ప్రశ్నించారు. ఇటీవల మంత్రి పి.త్యాగరాజన్‌పై ఈషా ప్రతినిధులు విమర్శలు కురిపించారు. అదే సమయంలో హిందూ ఆలయాల నిర్వహణ భక్తులకు అప్పగించాలని కోరారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి పి.త్యాగరాజన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-05-19T07:53:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising