ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

DMK పాలనలో హింసకు తావులేదు!

ABN, First Publish Date - 2021-12-11T15:15:27+05:30

డీఎంకే పాలనలో హింసకు తావులేదేని, పాలనపై రోజురోజుకూ ప్రజాభిమానం పెరుగుతుండటం చూసి ఓర్వలేక కొన్ని దుష్టశక్తులు పనిగట్టుకుని శాంతి భద్రతలు క్షీణిం చాయంటూ తప్పుడు సమాచారాలతో దుష్ప్రచారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                       - మంత్రి పీకే శేఖర్‌బాబు


చెన్నై: డీఎంకే పాలనలో హింసకు తావులేదేని, పాలనపై రోజురోజుకూ ప్రజాభిమానం పెరుగుతుండటం చూసి ఓర్వలేక కొన్ని దుష్టశక్తులు పనిగట్టుకుని శాంతి భద్రతలు క్షీణిం చాయంటూ తప్పుడు సమాచారాలతో దుష్ప్రచారం చేస్తున్నాయని దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు ఆరోపించారు. భారత దేశపు తొలి గవర్నర్‌ జనరల్‌ చక్రవర్తి రాజగోపాలాచారి 143వ జయంతి సందర్భంగా  చెన్నై హైకోర్టు ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి మంత్రులు పీకే శేఖర్‌బాబు, స్వామి నాధన్‌, అధికారులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా శేఖర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ డీఎంకే అధికారం లోకి వచ్చిన కొద్ది నెలల్లోనే 200కు పైగా ఎన్నికల హామీలను నెరవేర్చిందని, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతోందని చెప్పారు. దేవాదాయశాఖలో గతంలో లేని విధంగా ఆక్రమణలకు గురైన ఆలయ భూములను స్వాధీనం చేసుకున్నామని, ఆలయాల్లో కుంభాభిషేకాలు నిర్వహించేందుకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని ఆయన వివరించారు.

Updated Date - 2021-12-11T15:15:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising