ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబ్బున్న వారికే Congress టికెట్లు

ABN, First Publish Date - 2021-11-28T18:08:12+05:30

విధానపరిషత్‌ ఎన్నికల్లో భారీగా డబ్బులు ఉన్న వారినే ప్రజాప్రతినిధులను చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఇస్తోందని గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఈశ్వరప్ప ఆరోపించారు. దావణగెరెలో ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                   - గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఈశ్వరప్ప 


బెంగళూరు: విధానపరిషత్‌ ఎన్నికల్లో భారీగా డబ్బులు ఉన్న వారినే ప్రజాప్రతినిధులను చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఇస్తోందని గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఈశ్వరప్ప ఆరోపించారు. దావణగెరెలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ పార్టీలో పనిచేయనివారిని కనీసం రాజకీయాల్లో ఒక్కసారి కూడా పాల్గొనని వారిని డబ్బుంటే చాలు కొనుగోలు చేసుకోవచ్చుననే రీతిలో వెతికి మరీ ప్రజాప్రతినిధులను చేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందన్నారు. కేజీఎఫ్‌ బాబుకు అదే తరహాలో టికెట్‌ ఇచ్చారన్నారు. విధానపరిషత్‌ అంటే విమర్శలు, చర్చలకు వేదికగా కొనసాగిందని అయితే రాజకీయాల్లో సమూలమార్పులు తీసుకొచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్‌ దారి తప్పిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంత సమస్యలపై దశాబ్దాల కాలంగా సుదీర్ఘంగా చర్చ జరిగినా భవిష్యత్తు పరిస్థితి ప్రశ్నార్థకమవుతోందన్నారు. ఆర్థికం కాకుండా సమాజం కోసం పనిచేసే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జేడీఎస్‌ 7 చోట్ల మాత్రమే పోటీ చేస్తోందని, వారి నిర్ణయం ఇంకా తేల్చలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రం లో లేనే లేదన్నారు. లఖన్‌ జార్కిహొళి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం ఆయన వ్యక్తిగత విషయమన్నారు. ముఖ్యమంత్రి కూడా ఫోన్‌లో మాట్లాడారని, అయినా నామినేషన్‌ వాపసు తీసుకోలేదని, మా పార్టీ అభ్యర్థి గెలుపే మాకు ము ఖ్యమన్నారు. 

Updated Date - 2021-11-28T18:08:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising