ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రద్దీ ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు

ABN, First Publish Date - 2021-12-16T16:36:31+05:30

రాష్ట్రంలో వాహనాల రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రజాపనుల శాఖ మంత్రి ఏవీ వేలు పేర్కొన్నారు. దక్షిణ చెన్నై శివారులోని గూడువాంజేరి-సింగపెరుమాళ్‌ రైల్వేస్టేషన్ల మధ్య రూ.90.74 కోట్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                  - మంత్రి ఏవీ వేలు


ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రంలో వాహనాల రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రజాపనుల శాఖ మంత్రి ఏవీ వేలు పేర్కొన్నారు. దక్షిణ చెన్నై శివారులోని గూడువాంజేరి-సింగపెరుమాళ్‌ రైల్వేస్టేషన్ల మధ్య రూ.90.74 కోట్లతో వంతెన నిర్మితం కానుంది. బుధవారం జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి ఏవీ వేలు పాల్గొన్నారు. అదే విధంగా ఇదే వేదిక నుంచి వండలూరు-వాలాజాబాద్‌ రోడ్డులో రూ.26.64 కోట్లతో రెండంతస్తుల ఫ్లై ఓవర్‌ పనులకు కూడా మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గూడువాంజేరి-సింగపెరుమాళ్‌ రైల్వేస్టేషన్ల మధ్య నిర్మితమవుతున్న ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి వస్తే ఈ రెండు ప్రాంతాలకు చెందిన ప్రజలు వాహనాల్లో కాంచీపురానికి రద్దీ లేకుండా వెళ్లవచ్చని తెలిపారు. వండలూరు-వాలాజాబాద్‌ రహదారిలో నిర్మితమవుతున్న రెండంతస్తుల ఫ్లై ఓవర్‌ పనులు పూర్తయితే పడప్పై, ఓరగడం ప్రాంతాల్లోని కర్మాగారాలకు విడిభాగాలు తరలిస్తున్న భారీ వాహనాల వల్ల ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది ఏర్పడబోదని మంత్రి ఏవీ వేలు తెలిపారు. ఈ భూమి పూజ కార్యక్రమాల్లో గ్రామీణ పరిశ్రమల శాఖ మంత్రి టీఎం అన్బరసన్‌, కాంచీపురం ఎంపీ సెల్వం, ఎమ్మెల్యే వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-16T16:36:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising