ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ పెరగనున్న Milk ధర?

ABN, First Publish Date - 2021-10-24T17:38:56+05:30

రాష్ట్రంలో మళ్లీ పాలధర పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. పాడి నిర్వహణ భారంగా మారడంతో లీటరు పాలపై రూ.2 చొప్పున పెంచాలంటూ కర్ణాటక పాల సమాఖ్య (కేఎంఎఫ్‌) ఇప్పటికే రాష్ట్రప్రభుత్వానికి ప్రతిపాదన చేసిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                    - లీటరుకు రూ.2 పెంపుపై కేఎంఎఫ్‌ ప్రతిపాదన 


బెంగళూరు(Karnataka): రాష్ట్రంలో మళ్లీ పాలధర పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. పాడి నిర్వహణ భారంగా మారడంతో లీటరు పాలపై రూ.2 చొప్పున పెంచాలంటూ కర్ణాటక పాల సమాఖ్య (కేఎంఎఫ్‌) ఇప్పటికే రాష్ట్రప్రభుత్వానికి ప్రతిపాదన చేసిన సంగతి విదితమే. ఈ మేరకు సమాఖ్య డైరెక్టర్‌ కాపు దివాకర్‌శెట్టి శనివారం సంకేతాలు అందించారు. రెండేళ్లుగా పాలధర పెంచలేదని పేర్కొన్న ఆయన కొవిడ్‌ అవధిలో పాడిపరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని చవిచూసిందన్నారు. మొత్తం 14 పాల డెయిరీలు కూడా ధర పెంపు డిమాండ్‌ను చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని మొత్తం 14 డెయిరీలతో సమాఖ్య పనిచేస్తోందని, ప్రతిరోజూ 51 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తోందని, వీటిలో నేరుగా ప్రజలకు విక్రయించే పాలు మినహాయించగా మిగిలిన పాలను ఉత్పత్తులుగా మార్చి దేశమంతటా విక్రయిస్తోందన్నారు. పాలధర పెంపుపై ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. 

Updated Date - 2021-10-24T17:38:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising