ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిల్‌గేట్స్‌ను మైక్రోసాఫ్ట్‌ ఆనాడే హెచ్చరించిందట..

ABN, First Publish Date - 2021-10-20T08:14:54+05:30

మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ 2020లో సంస్థ బోర్డు నుంచి తప్పుకొన్నారు. 20ఏళ్ల క్రితం సంస్థలోని ఓ మహిళా ఉద్యోగితో నడిపిన లైంగిక సంబంధాలే దానికి కారణమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెడ్‌మాండ్‌, అక్టోబరు 19: మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ 2020లో సంస్థ బోర్డు నుంచి తప్పుకొన్నారు. 20ఏళ్ల క్రితం సంస్థలోని ఓ మహిళా ఉద్యోగితో నడిపిన లైంగిక సంబంధాలే దానికి కారణమయ్యాయి. అయితే, ఆ విషయంపై 2008లోనే బిల్‌గేట్స్‌ను కంపెనీ హెచ్చరించినట్లు తాజా కథనంలో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. 2007లో బిల్‌గేట్స్‌ మైక్రోసాఫ్ట్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో ఓ మహిళా ఉద్యోగికి అభ్యంతరకర ఈ-మెయిల్స్‌ పంపారు. బయట వ్యక్తిగతంగా కలవాలని వాటిలో పేర్కొన్నారు. ఏడాది తర్వాత ఆ విషయం కంపెనీ బోర్డు దృష్టికి వెళ్లింది. ప్రస్తుత ప్రెసిడెంట్‌.. అప్పట్లో జనరల్‌ కౌన్సిల్‌ బ్రాడ్‌స్మిత్‌, ఎగ్జిక్యూటీవ్‌ బోర్డు సభ్యుడు.. బిల్‌తో సమావేశమయ్యారు. ఇలాంటి ప్రవర్తన తప్పని.. మానుకోవాలని హెచ్చరించారు. దీంతో మళ్లీ ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయనని వారికి బిల్‌గేట్స్‌ చెప్పారని పేర్కొంది.

Updated Date - 2021-10-20T08:14:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising