ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెట్రో సొరంగ మార్గానికి గ్రీన్‌ సిగ్నల్‌

ABN, First Publish Date - 2021-06-24T17:06:16+05:30

కొవిడ్‌ వేళ ఆక్సిజన్‌ సిలిండర్‌ అందుబాటులో లేకపోవడంతో స్తంభించిన మెట్రో సొరంగ మార్గాల పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. సొరంగాన్ని తవ్వే ఎనిమిదో యంత్రం నాగవార, డెయిరీ సర్కి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


బెంగళూరు: కొవిడ్‌ వేళ ఆక్సిజన్‌ సిలిండర్‌ అందుబాటులో లేకపోవడంతో స్తంభించిన మెట్రో సొరంగ మార్గాల పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. సొరంగాన్ని తవ్వే ఎనిమిదో యంత్రం నాగవార, డెయిరీ సర్కిల్‌ మార్గంలోనూ వెంకటేశపుర స్టేషన్‌ నుంచి తవ్వకాలు జరుపాల్సి ఉంది. తప్పనిసరిగా దీనికి ఆక్సిజన్‌ సిలిండర్లు అవసరం కానుండడంతో కొవిడ్‌ కొరత కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు. బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఉన్నతాధికారి ఒకరు బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు మెట్రో తవ్వకాల మార్గంలో మొత్తం 8 టీబీఎంలు పనిచేస్తున్నాయని, త్వరలో మరో యంత్రం కూడా రానుందని చెప్పారు. దీంతో మెట్రో సొరంగ మార్గాల పనులను ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని తలపోస్తున్నామన్నారు. సొరంగ మార్గాలు పూర్తయితే ప్రస్తుతం చేపట్టిన మెట్రో ప్రాజెక్ట్‌లో మూడో భాగం కొలిక్కి వచ్చినట్టేనని ఆయన వెల్లడించారు. మెట్రో సొరంగ మార్గాల తవ్వకాలకు, ఇతర నిర్మాణ పనులకు అవసరమైన ఆక్సిజన్‌ సిలిండర్లను సమకూర్చుకున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు తక్కువగా ఉండడంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ నిల్వలు తగిన ప్రమాణంలో ఉండడం వల్ల మెట్రో పనులకు వీటిని వినియోగించేందుకు ఉన్నతాధికారులు అన్నిరకాల అనుమతులు మంజూరు చేశారన్నారు.  

Updated Date - 2021-06-24T17:06:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising