ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండేళ్లలో మెట్రో, జమ్మూ విమానాశ్రయ విస్తరణ: అమిత్‌షా

ABN, First Publish Date - 2021-10-25T00:06:22+05:30

జమ్మూ సిటీ, శ్రీనగర్‌లో రెండేళ్లలో మెట్రో సర్వీసులు ప్రారంభిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: జమ్మూ సిటీ, శ్రీనగర్‌లో రెండేళ్లలో మెట్రో సర్వీసులు ప్రారంభిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు. జమ్మూలోని భాగ్‌వతి నగర్ ప్రాంతంలో ఆదివారంనాడు జరిగిన ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ, జమ్మూ విమానాశ్రయాన్ని విస్తరించి, జమ్మూకశ్మీర్‌లోని ప్రతి జిల్లాలో హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభిస్తామని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో ప్రారంభించిన అభివృద్ధిని ఎవరూ ఆపలేరని, ఇది ఆలయాల భూమి అని, మాతా వైష్ణోదేవి, ప్రేమ్‌నాథ్ డోగ్రాల పుణ్యభూమి అని, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ త్యాగాల గడ్డ అని, జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని అమిత్‌షా స్పష్టం చేశారు. జమ్మూ ప్రజలకు జరుగుతూ వస్తున్న అన్యాయాలకు ఇక కాలం చెల్లిందని అన్నారు. కొందరు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి శకాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారనీ, అయితే అభివృద్ధి అడ్డుకోవడం ఎవరి తరం కాదని తాను హామీ ఇవ్వదలచుకున్నానని పేర్కొన్నారు.


''370వ అధికరణను రద్దు చేయాలని ప్రధానమంత్రి మోదీ నిర్ణయించారు. వాల్మీకి సమాజం, వెస్ట్ పాకిస్తాన్ శరణార్థులపై వివక్షకు తెరపడింది. కనీస వేతనాల చట్టం జమ్మూకశ్మీర్‌లో అమల్లోకి వచ్చింది'' అని షా పేర్కొన్నారు. కశ్మీర్‌కు రూ.12,000 కోట్లు విలువచేసే పెట్టుబడులు ఇప్పటికే వచ్చాయని, 2022 చివరికి రూ.51,000 కోట్లు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం ఉంటే ఉగ్రవాదుల దుష్టపన్నాగాలు బెడిసికొడతాయని అమిత్‌షా స్పష్టం చేశారు. మూడు రోజుల జమ్మూకశ్మీర్ పర్యటనలో భాగంగా అమిత్‌షా శనివారంనాడు ఇక్కడకు వచ్చారు. 370 అధికరణ రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఆయన పర్యటిస్తుండటం ఇదే మొదటిసారి.

Updated Date - 2021-10-25T00:06:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising