ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చుక్కలు చూపిస్తున్న బ్యాంకుల విలీనం

ABN, First Publish Date - 2021-03-05T07:45:56+05:30

దేశంలో బ్యాంకుల విలీనంతో తలెత్తుతున్న సమస్యలు ప్రవాస భారతీయులకు తీవ్ర ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి. తమ వారికి డబ్బులు పంపించేందుకు నానా ఇక్కట్లు పడుతున్నారు. బ్యాంకుల పొరపాట్ల కారణంగా ఆయా ఖాతాలకు నెట్‌ బ్యాంకింగ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్తంభించిన నెట్‌ బ్యాంకింగ్‌తో ఇబ్బందులు

డబ్బు పంపలేకపోతున్న ప్రవాసులు.. మళ్లీ హవాలాకు అవకాశం ?


(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

దేశంలో బ్యాంకుల విలీనంతో తలెత్తుతున్న సమస్యలు ప్రవాస భారతీయులకు తీవ్ర ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి. తమ వారికి డబ్బులు పంపించేందుకు నానా ఇక్కట్లు పడుతున్నారు. బ్యాంకుల పొరపాట్ల కారణంగా ఆయా ఖాతాలకు నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు స్తంభించిపోవడం, ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌లు మారిపోవడం వంటి కారణాలతో నగదు బదిలీ కావడం లేదు. కొంత మంది ఈ అవాంతరాలను అధిగమించి నగదు బదిలీ చేసినా.. సాంకేతిక కారణాలతో ఆ నగదు తిరిగి అదే ఖాతాలకు బదిలీ అవుతోంది. దీంతో స్వదేశంలో ఉన్న తమ వారికి అవసరాలకు అనుగుణంగా నగదు పంపించలేక ప్రవాసీయులు అనేక ఇక్కట్లు పడుతున్నారు. దేశంలో పలు బ్యాంకులు ఇతర బ్యాంకుల్లో విలీనమైన విషయం విదితమే. అయితే, విలీనం చేసుకున్న బ్యాంకులు సాంకేతిక కారణాలతో అందుకు అనుగుణంగా ఇంకా పూర్తి స్థాయి కార్యకలాపాలను ప్రారంభించలేదు. 


విలీనానంతరం బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఖాతాదారులను తెలియజేయడంలో బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఖాతాదారుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. ఖాతా కలిగివున్న బ్యాంకు ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌ మార్పు జరిగిందన్న విషయం తెలియక అనేక మంది ప్రవాసీయులు ఆ ఖాతాలకు నెట్‌ బ్యాంకింగ్‌ సేవలను కోల్పోయారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా ఆంధ్రా బ్యాంకు యూనియన్‌ బ్యాంకుతో విలీనం కావడం ద్వారా తలెత్తున్న సమస్యలతో ప్రవాసీయులు తమ వాళ్లకు డబ్బులు పంపించలేకపోతున్నారు. గల్ఫ్‌ దేశాల్లోని అనేక బ్యాంకులు, మనీ ఎక్స్చేంజీల్లో బ్యాంకు నూతన ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌ ప్రదర్శితం కాకపోవడంతో నగదు బదిలీ చేయలేకపోతున్నారు. అతి కష్టంగా కొందరు చేయగలగినా గల్ఫ్‌లోని భారత కరస్పాండెంట్‌ బ్యాంకుల వరకు డబ్బులు వెళ్తున్నాయి కాని, అక్కడి నుండి ఎండ్‌ బ్యాంకులకు జమ కాక తిరిగి వస్తున్నాయి. దీంతో ఎక్స్ఛేంజి రుసుము, ఇతర సర్వీసు చార్జీల రూపంలో నష్టపోతున్నారు. ఉత్తరాదిలో ప్రత్యేకించి బిహార్‌, జార్ఘండ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలలో గ్రామీణ, ప్రధాన బ్యాంకుల్లోనూ ఇదే రకమైన సమస్య ఎదురు కావడంతో అక్కడ హవాలా విధానం ద్వారా పంపుతున్నారు. 

Updated Date - 2021-03-05T07:45:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising