ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య విద్యార్థులకు ఉపకార వేతనం పెంపు

ABN, First Publish Date - 2021-08-01T14:14:37+05:30

రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్యకళాశాలల్లో పనిచేసే శిక్షణా వైద్యులు, ప్రభుత్వ విధుల్లో లేని పీజీ వైద్యులకు మాసాంతపు ఉపకార వేతనం పెంచుతూ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసిఎఫ్‌(చెన్నై): రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్యకళాశాలల్లో పనిచేసే శిక్షణా వైద్యులు, ప్రభుత్వ విధుల్లో లేని పీజీ వైద్యులకు మాసాంతపు ఉపకార వేతనం పెంచుతూ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి జె.రాధాకృష్ణన్‌ జీవో విడుదల చేశారు. శిక్షణా వైద్యులకు అందిస్తున్న నెలవారీ ఉపకారవేతనం రూ.21,800 ఉండగా, రూ.25 వేలు గా పెంచారు. పీజీ వైద్య కోర్సుల్లో చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.38 వేల నుంచి రూ.48 వేలు, రెండవ సంవత్సరం విద్యార్థులకు రూ.40,500 నుంచి రూ.49 వేలు, మూడవ సంవత్సరం విద్యార్థులకు రూ.43 వేల నుంచి రూ.50 వేలుగా ఉపకారవేతనం పెంచారు. అలాగే, పీజీ డిప్లొమో కోర్సు చదివే మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.38 వేల నుంచి రూ.45 వేలు, రెండవ సంవత్సరం విద్యార్థులకు రూ.40,500 నుంచి రూ.47,500, ఉన్నత ప్రత్యేక వైద్యకోర్సులు చదివే మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.43 వేల నుంచి రూ.50 వేలు, రెండవ సంవత్సరం విద్యార్థులకు రూ.46,500 నుంచి రూ.52,500, మూడవ సంవత్సరం విద్యార్థులకు రూ.48 వేల నుంచి రూ.55 వేలు ఉపకారవేతనం పెంచారు.

Updated Date - 2021-08-01T14:14:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising