ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేద, శ్రామిక ప్రజలకు కరోనా టీకా ఉచితంగా ఇవ్వాలి: మాయావతి

ABN, First Publish Date - 2021-03-17T21:22:15+05:30

దేశంలో కరోనా వ్యప్తి మరోసారి తీవ్రమైన నేపధ్యంలో ఈరోజు ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశం కావడం సరైనది, స్వాగతించదగినది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలోని పేద, శ్రామిక వర్గాల ప్రజలకు కరోనా టీకా ఉచితంగా ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి విజ్ణప్తి చేశారు. కరోనా మరోసారి విస్తరిస్తున్న నేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి సమావేశం కావడాన్ని ఆమె స్వాగతించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా వీలైనంత తొందరగా ప్రజోపయోగమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆమె అన్నారు. బుధవారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.


‘‘దేశంలో కరోనా వ్యప్తి మరోసారి తీవ్రమైన నేపధ్యంలో ఈరోజు ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశం కావడం సరైనది, స్వాగతించదగినది. ప్రస్తుతం జరుగుతున్న చర్చల ద్వారా కరోనా టీకా ఉపయోగం, పంపిణీపై మరింత ప్రచారం జరగాలి. అంతే కాకుండా టీకా పంపిణీ మరింత వేగవంతం, సులభతరం కావాలి. ఇదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బహుజన్ సమాజ్ పార్టీ ఒక విజ్ణప్తి చేస్తోంది. దేశంలోని పేద, శ్రామిక వర్గాలకు ఉచితంగా కరోనా టీకా వేయాలని బీఎస్పీ కోరుతోంది’’ అని మాయావతి ట్వీట్ చేశారు.

Updated Date - 2021-03-17T21:22:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising