ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్గిపెట్టె @2 రూపాయలు!

ABN, First Publish Date - 2021-10-24T09:29:15+05:30

రూపాయికి దొరికే ఓ ఐదు వస్తువుల పేర్లు చెప్పమంటే.. ముందుగా గుర్తొచ్చేది అగ్గిపెట్టె.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, అక్టోబరు 23: రూపాయికి దొరికే ఓ ఐదు వస్తువుల పేర్లు చెప్పమంటే.. ముందుగా గుర్తొచ్చేది అగ్గిపెట్టె. దేశంలో నిత్యావసర వస్తువులన్నీ ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో.. ప్రతి ఇంట్లోనూ అత్యవసరమైన అగ్గిపెట్టె మాత్రం 14 ఏళ్లుగా ఒక్క రూపాయికే దొరుకుతోంది. కానీ, ఇప్పుడు దీని ధర కూడా రెండింతలు కాబోతోంది. వచ్చే 1 నుంచి అగ్గిపెట్టె ధరను రెండు రూపాయలు చేయాలని తయారీదారులు నిర్ణయించారు. తయారీ ముడి సరుకుల్లో చాలా వాటి ధరలు భారీగా పెరిగాయని, ఈ పరిస్థితుల్లో ధర పెంచడం ఒక్కటే తమకున్న మార్గమని తయారీ దారులు తెలిపారు. రూ.425గా ఉన్న రెడ్‌ ఫాస్ఫరస్‌ ధర.. రూ.810కి, రూ.58గా ఉన్న మైనం ధర రూ.80కి చేరిందని పేర్కొన్నారు. పెరుగుతున్న పెట్రో ధరల కారణంగా రవాణా చార్జీలు కూడా భారంగా మారాయన్నారు. కాగా, చివరగా 2007లో అగ్గిపెట్టె ధర అర్ధ రూపాయి నుంచి రూపాయికి పెరిగింది.

Updated Date - 2021-10-24T09:29:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising