ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

WHO confirmed : ఆఫ్రికాలో మార్ బుర్గ్ కొత్త వైరస్

ABN, First Publish Date - 2021-08-10T13:53:05+05:30

పశ్చిమ ఆఫ్రికాలో మార్ బుర్గ్ అనే మరో కొత్త వైరస్ ప్రబలింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పశ్చిమ ఆఫ్రికాలో మార్ బుర్గ్ అనే మరో కొత్త వైరస్ ప్రబలింది. పశ్చిమ ఆఫ్రికా గినియాలోని గ్యూకెడౌలో మార్ బుర్గ్ కొత్త వైరస్ కేసులు వెలుగుచూసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తాజాగా వెల్లడించింది. ఎబోలా వైరస్ జాతికి చెందిన మార్ బుర్గ్ కొత్త వైరస్ కేసు బయటపడిందని డబ్ల్యూహెచ్‌వో ధ్రువీకరించింది. మార్ బుర్గ్ వైరస్ సోకిన రోగి గ్యూకెడౌలోని కౌండౌ ప్రాంత క్లినిక్ లో చికిత్స కోసం చేరారని, వైద్యుల బృందం అతన్ని పరీక్షిస్తుందని అధికారులు చెప్పారు. గినియా నగర ఆరోగ్య కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి కొత్త వైరస్‌ను గుర్తించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆఫ్రికా ప్రాంత డైరెక్టర్ డాక్టర్ మత్షిడిసో మోయీ చెప్పారు.


 ఎబోలా వైరస్ ప్రబలిన ప్రాంతమైన గినియా వెలుగుచూసిన మార్ బుర్గ్ వైరస్ ను కట్టడి చేసేందుకు వైద్యాధికారులు ప్రయత్నిస్తున్నారు. కొత్త వైరస్ పై పరిశోధనలు చేయడానికి డబ్ల్యూహెచ్‌వోకు చెందిన 10 మంది నిపుణుల బృందాన్ని పశ్చిమ ఆఫ్రికాకు పంపించారు.2014వ సంవత్సరంలో ఎబోలా వ్యాప్తి చెందింది.మార్ బుర్గ్ వైరస్ వల్ల రక్తస్రావంతోపాటు జ్వరం వస్తుంది. గబ్బిలాల నుంచి ప్రజలకు వ్యాపించే ఈ వైరస్ వల్ల అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పితో రక్తస్రావం అవుతోందని వైద్యనిపుణులు చెబుతున్నారు. 

Updated Date - 2021-08-10T13:53:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising