ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిమ్స్‌లో చేరిన మన్మోహన్‌ సింగ్‌

ABN, First Publish Date - 2021-10-14T06:56:35+05:30

మాజీ ప్రధాన మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ అనారోగ్యంతో ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఆస్పత్రిలో చేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, అక్టోబరు 13: మాజీ ప్రధాన మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ అనారోగ్యంతో ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఆస్పత్రిలో చేరారు. జ్వరంతోపాటు నీరసంగా ఉండటంతో బుధవారం సాయంత్రం ఎయిమ్స్‌లో అడ్మిట్‌ అయ్యారు. 89 ఏళ్ల మన్మోహన్‌ సింగ్‌కు ఈ ఏడాది ఏప్రిల్‌లో కరోనా సోకిన సంగతి తెలిసిందే. మన్మోహన్‌ సింగ్‌కు  సోమవారం జ్వరం వచ్చి తగ్గిందని, అయితే మళ్లీ నీరసంగా అనిపించడంతో ఆస్పత్రికి వెళ్లారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం హృద్రోగ నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మాజీ ప్రధాని ఆరోగ్యం నిలకడగా ఉందని, సాధారణ చికిత్స తీసుకుంటున్నారని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. ఆయన ఆరోగ్యంపై వదంతులను నమ్మవద్దని తెలిపింది. మాజీ ప్రధాని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్ని, కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ, మాజీ మంత్రులు అశ్వనీ కుమార్‌, అభిషేక్‌ సింఘ్వీ తదితర నేతలు తెలిపారు.

Updated Date - 2021-10-14T06:56:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising