ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delta variant: మణిపూర్‌లో 10 రోజుల పాటు కర్ఫ్యూ

ABN, First Publish Date - 2021-07-16T17:29:17+05:30

మణిపూర్‌లో కరోనా కట్టడికి తాజాగా పదిరోజుల పాటు కర్ఫ్యూ విధించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : మణిపూర్‌లో కరోనా కట్టడికి తాజాగా పదిరోజుల పాటు కర్ఫ్యూ విధించారు.మణిపూర్‌లో డెల్టా వేరియంట్ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జులై 18వతేదీ నుంచి పదిరోజుల పాటు పూర్తి కర్ఫ్యూను విధించాలని మణిపూర్ సర్కారు నిర్ణయించింది. డెల్టా వేరియంట్ కరోనా కట్టడి కోసం అత్యవసర సర్వీసులు మినహా అన్ని సంస్థలను కర్ఫ్యూ సమయంలో మూసిఉంచాలని ఆదేశించినట్లు మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ చెప్పారు. కర్ఫ్యూ సమయంలో కేవలం వ్యాక్సినేషన్, కరోనా పరీక్షల కోసమే ప్రజలను బయట తిరిగేందుకు అనుమతిస్తామని సీఎం బీరేన్ సింగ్ పేర్కొన్నారు.


 గడచిన 24 గంటల్లో 1,104 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మణిపూర్ లో మొత్తం 8,210 యాక్టివ్ కరోనా కేసులు నమోదైనాయి. మణిపూర్ లో కరోనా కేసుల సంఖ్య 80,521 కు పెరిగింది. గత 24 గంటల్లో కరోనాతో 17 మంది మరణించారు. కరోనా కట్టడి కోసం 10 రోజులపాటు మణిపూర్ లో పూర్తి కర్ఫ్యూ అమలుకు సహకరించాలని వైద్యాధికారులు కోరారు. 


Updated Date - 2021-07-16T17:29:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising