ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ది బిగ్గెస్ట్‌ ఫ్యామిలీ మేన్‌’ కన్నుమూశారు!

ABN, First Publish Date - 2021-06-14T07:47:37+05:30

జియోనా చానా.. మిజోరామ్‌కు చెందిన 76 ఏళ్ల ఈ వ్యక్తి ఆదివారం మరణించారు. ఆయనకు ఏకంగా 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు ఉన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 38 మంది భార్యలు..  89 మంది పిల్లలు..

ఐజ్వాల్‌ (మిజోరామ్‌), జూన్‌ 13: జియోనా చానా.. మిజోరామ్‌కు చెందిన 76 ఏళ్ల ఈ వ్యక్తి ఆదివారం మరణించారు. ఆయనకు ఏకంగా 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు ఉన్నారు. 33 మంది మనవలు, మనవరాళ్లు, కోడళ్లనూ కలుపుకుంటే ఆ కుటుంబ సభ్యుల సంఖ్య 160 పైమాటే..! ఇంత పెద్ద కుటుంబానికి యజమాని జియోనా చానా. ప్రపంచంలో ఇదే అతిపెద్ద కుటుంబమని మిజోరామ్‌ ముఖ్యమంత్రి జోరమ్‌తంగా నమ్ముతున్నారట! చానా కుటుంబం వల్లే ఆయన స్వగ్రామం భక్తవంగ్‌ పర్యాటక కేంద్రంగా మారిందట! చానా అస్వస్థతకు గురై ఐజ్వాల్‌లోని ఓ ఆస్పత్రిలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. 1945లో జన్మించిన ఆయన తన 17వ ఏట 20 ఏళ్ల యువతిని తొలి వివాహం చేసుకున్నారు. ఆయన కుటుంబమంతా నూరు గదులున్న ఓ నాలుగు అంతస్థుల భవనంలో కలిసే ఉంటుంది. కుమారులు తమ భార్యలతో కలిసి వేర్వేరు గదుల్లో ఉంటారు. ఆ కుటుంబం మొత్తానికీ వంటగది మాత్రం ఒక్కటే. వీళ్లది పెద్దగా ఆస్తిపాస్తులున్న కుటుంబమేమీ కాదు. అక్కడికి వచ్చే పర్యాటకులు చేసే ఆర్థిక సాయంతో రోజులు నెట్టుకొస్తుంటారు. చాను మృతికి సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.

Updated Date - 2021-06-14T07:47:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising