ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌లో చూసి బాంబు తయారీ

ABN, First Publish Date - 2021-06-14T07:28:11+05:30

ఓ యువకుడు బ్యాగులో బాంబు పెట్టుకుని సరాసరి పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లడం స్థానికంగా కలకలం సృష్టించింది. తీరా ఆ బాంబు తయారు చేసింది అతడేనని విచారణలో తేలడంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పోలీసులకే ఝలక్‌ ఇచ్చిన యువకుడు!
  • ఎవరో బాంబు వదిలి వెళ్లారని తొలుత బుకాయింపు

నాగ్‌పూర్‌, జూన్‌ 13: ఓ యువకుడు బ్యాగులో బాంబు పెట్టుకుని సరాసరి పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లడం స్థానికంగా కలకలం సృష్టించింది. తీరా ఆ బాంబు తయారు చేసింది అతడేనని విచారణలో తేలడంతో.. పోలీసులు అవాక్కయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. శనివారం స్థానిక నందన్‌వాన్‌ పోలీ్‌సస్టేషన్‌కి ఓ యువకుడు బ్యాగ్‌ తగిలించుకుని తాపీగా నడుచుకుంటూ వచ్చాడు. నింపాదిగా తన బ్యాగ్‌లో ఉన్న బాంబును అక్కడ పెట్టాడు. అది బాంబ్‌ అని తెలుసుకున్న పోలీసులు తొలుత షాకయ్యారు. అనంతరం ప్రశ్నించగా.. బాంబు ఉన్న ఈ బ్యాగు తనకు అక్కడకు దగ్గరలో ఉన్న ఓ కాలేజీ ప్రాంగణంలో దొరికిందని చెప్పాడు. అతడి మాటలు నమ్మని పోలీసులు.. అనుమానంతో ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పేశాడు. 25 ఏళ్ల ఆ యువకుడి పేరు రాహుల్‌ పగాడే. స్థానికంగా ఓ సెలూన్‌లో పనిచేసే అతడు.. ఒంటరిగా నివసిస్తున్నాడు. ఆన్‌లైన్‌లో చూసిన కొన్ని వీడియోల ద్వారా బాంబు ఎలా తయారుచేయాలో నేర్చుకున్నాడు. టపాకాయల నుంచి నల్లమందు సేకరించి.. సెల్‌ఫోన్‌ బ్యాటరీ, పెట్రోల్‌ బాటిల్‌ సహాయంతో బాంబు తయారు చేసేశాడు. ఆ తర్వాత దాన్ని ఏం చేయాలో అర్థం కాక, ఎలా నిర్వీర్యం చేయాలో తెలియక.. సరాసరి పోలీ్‌సస్టేషన్‌కు చేరుకుని ఓ చిన్న డ్రామా ప్లే చేశాడు. 

Updated Date - 2021-06-14T07:28:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising