ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌.. బహుమతిగా ఐదు లీటర్ల..

ABN, First Publish Date - 2021-03-04T01:04:56+05:30

ఏదైనా క్రీడలో మీరు విజేతగా నిలిస్తే.. ఏ కప్పో లేదా షీల్డో వస్తుంది. దాన్ని జాగ్రత్తగా ఇంటి తీసుకొచ్చి కప్ బోర్డులో భద్రపరుచుకుంటారు. దాన్ని చూసినప్పుడల్లా నాటి విజయం గుర్తుకు వచ్చి మనసు ఉప్పొంగుతుంది. ఇటువంటి బహుమతులకు విలువకట్టలేం. కానీ.. భోపాల్ లో ఇటీవల జరిగిన ఓ క్రికెట్‌ మ్యాచ్‌‌లో క్రీడాకారులకు ఎటువంటి కప్పులూ లేదా షీల్డులూ ఇవ్వలేదు. అందుకుబదులుగా..ప్రస్తుత కాలంలో ‘అత్యంత ఉపయోగకరమైన’ వాటిని ఆ క్రీడాకారులు బహుమతులుగా పొందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: ఏదైనా క్రీడలో మీరు విజేతగా నిలిస్తే.. ఏ కప్పో లేదా షీల్డో వస్తుంది. దాన్ని జాగ్రత్తగా ఇంటి తీసుకొచ్చి కప్ బోర్డులో భద్రపరుచుకుంటారు. దాన్ని చూసినప్పుడల్లా నాటి విజయం గుర్తుకు వచ్చి మనసు ఉప్పొంగుతుంది. ఇటువంటి బహుమతులకు విలువకట్టలేం. కానీ.. భోపాల్ లో ఇటీవల జరిగిన ఓ క్రికెట్‌ మ్యాచ్‌‌లో క్రీడాకారులకు ఎటువంటి కప్పులూ లేదా షీల్డులూ ఇవ్వలేదు. అందుకుబదులుగా..ప్రస్తుత కాలంలో ‘అత్యంత ఉపయోగకరమైన’ వాటిని ఆ క్రీడాకారులు బహుమతులుగా పొందారు. అవి ఏంటో తెలుసా.. పెట్రోలూ గ్యాస్ బండా! అవును..ఇందుకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ నిర్వహకులు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఓ క్రీడాకారుడికి బహుమతిగా ఐదు లీటర్ల పెట్రోల్ ఇచ్చారు. ఇక మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన ఆటగాడిని గ్యాస్ బండతో సత్కరించారు. ఈ మ్యాచ్ ఆదివారం నాడు జరిగినట్టు తెలుస్తోంది.


కాగా.. ఈ చిత్రాలపై ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే కూడా స్పందించారు. ఈ కొత్త మ్యాచ్ గురించి విన్నా. ఉపయోగపడే బహుమతినే ఇచ్చారు. అని కామెంట్ చేశారు.  నెటిజన్లు కూడా తమ కామెంట్లతో ఓ రేంజ్‌లో కితకితలు పెడుతున్నారు. ఈ రోజుల్లో ఇంతకంటే విలువైన బహుమతి ఉంటుందా అని కామెంట్ చేస్తున్నారు. అంతేగా.. అంతేగా అంటూ మిగిలన వారు ఈ వ్యాఖ్యలకు తమ మద్దతు తెలుపుతున్నారు.  

Updated Date - 2021-03-04T01:04:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising