ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా భార్య చనిపోయేలా ఉంది

ABN, First Publish Date - 2021-04-23T08:23:20+05:30

తీవ్ర అస్వస్థతతో ఉన్న భార్యను తీసుకొని అప్పటికే అతడు బైక్‌పై మూడు ఆస్పత్రులు తిరిగాడు. పడకల్లేవంటూ ఎక్కడా చేర్చుకోలేదు. చివరకు కొవిడ్‌ రోగులకు చికిత్స అందించే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కాళ్లు మొక్కుతా చేర్చుకోండి..  
  • ఆస్పత్రి ఎదుట భర్త వేడుకోలు..

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22: తీవ్ర అస్వస్థతతో ఉన్న భార్యను తీసుకొని అప్పటికే అతడు బైక్‌పై మూడు ఆస్పత్రులు తిరిగాడు. పడకల్లేవంటూ ఎక్కడా చేర్చుకోలేదు. చివరకు కొవిడ్‌ రోగులకు చికిత్స అందించే అతి పెద్దదైన లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ ఆస్పత్రికి వచ్చాడు. అయితే, అక్కడా చికిత్స కష్టంగానే కనిపించడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. దీంతో ‘‘నా భార్య రూబీ ఖాన్‌ (30) చనిపోయేలా ఉంది. ఆమెను అలా ఎలా వదిలేయగలను? దయచేసి చేర్చుకోండి. కాళ్లు మొక్కేందుకూ సిద్ధం’’ అని ఏడుస్తూ, ఆస్పత్రి సిబ్బందిని ప్రాధేయపడుతూ అస్లాం ఖాన్‌ అనే వ్యక్తి మీడియాకు కనిపించాడు. ఢిల్లీలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ (ఎల్‌ఎన్‌జేపీ) ఆస్పత్రి ఎదుట కనిపించిందీ దృశ్యం. 


మృతులు 137.. లెక్కల్లో ఐదుగురే

భోపాల్‌: ఒక్క రోజు.. రెండు శ్మశాన వాటికలు.. 137 మంది కొవిడ్‌ మృతులకు అంత్యక్రియలు..! మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో బుధవారం పరిస్థితి. క్షేత్ర స్థాయిలో ఇలా ఉంటే.. ప్రభుత్వం మాత్రం చనిపోయింది ఐదుగురే అని చెబుతోంది. దీనిపై వివరణ కోరేందుకు మీడియా ప్రయత్నించగా.. అధికారులు అందుబాటులోకి రాలేదు.   


శ్మశానవాటికగా డంపింగ్‌ యార్డు

గాంధీనగర్‌: కరోనాతో రోజుకు 50 మందిపైగా మృతి చెందుతుండటం.. సీఎన్‌జీతో నడిచే ఫర్నే్‌సలు చెడిపోవడంతో గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లో అంత్యక్రియలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో ఇక్కడి సెక్టార్‌ 39లోని డంపింగ్‌ యార్డును దహనవాటికగా మార్చాల్సి వచ్చింది.

Updated Date - 2021-04-23T08:23:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising