ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరలను పెంచి బీజేపీ లూటీ చేస్తోంది : మమత ఫైర్

ABN, First Publish Date - 2021-03-07T21:32:26+05:30

బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ సభను నిర్వహిస్తుండగా, దానికి పోటీగా సీఎం మమత బెనర్జీ నిరసన కార్యక్రమాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ సభను నిర్వహిస్తుండగా, దానికి పోటీగా సీఎం మమత బెనర్జీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెరిగిన సిలిండర్ ధరలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలతో కలిసి పాదయాత్ర నిర్వహిస్తూ నిరసనను వ్యక్తం చేశారు. అధికార బీజేపీ ప్రజలను దోచుకుంటోందని మండిపడ్డారు. పెరిగిన ధరలు మోదీ దృష్టికి తీసుకురావడానికే తాము ఈ ర్యాలీని నిర్వహించామని, ప్రస్తుతం మోదీ బెంగాల్ పర్యటనలోనే ఉన్నారని ఆమె పేర్కొన్నారు. పెట్రో, సిలిండర్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, దీనికి మోదీ సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. మోదీ కేవలం మాటలు మాత్రమే చెబుతారని ఎద్దేవా చేశారు. బెంగాల్‌లో మార్పు రావాలని మోదీ పదే పదే అంటారని, కేంద్రంలో పరివర్తన వస్తుందని, మోదీ కుర్చీ నుంచి గద్దె దిగుతారని ఆమె రివర్స్ కౌంటర్ ఇచ్చారు. బెంగాల్‌లో మహిళలు అత్యంత సురక్షితంగా ఉన్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పరిస్థితులు బాగోలేవని విమర్శించారు.

Updated Date - 2021-03-07T21:32:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising