ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని అభ్యర్థిత్వంపై మమత బెనర్జీ స్పందన

ABN, First Publish Date - 2021-05-05T01:03:11+05:30

ఇక మహారాష్ట్రలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటు అనంతరం ఎన్సీపీ అధినేత శరాద్ పవార్, బీజేపీ వ్యతిరేక కూటమికి బాధ్యత వహిస్తే బాగుంటుందని కొందరు ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయని మరికొందరు ప్రచారం చేశారు. అయితే వాటికి సంబంధించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీ మూడోసారి ఘన విజయం సాధించిన అనంతరం.. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలో ఏర్పడబోయే ఫ్రంట్ నుంచి ప్రధాన మంత్రి అభ్యర్థి ఆమెనే అంటూ విస్తృత చర్చ జరుగుతోంది. బీజేపీ తర్వాత దేశంలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ, ఆ పార్టీ నుంచి ప్రధానమంత్రి స్థాయిలో అభ్యర్థులు లేరనేది రాజకీయ విశ్లేషకుల వాదన. బయటికి ప్రకటించక పోయినప్పటికీ 2019 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రధాని అభ్యర్థి రాహులేనని అనేక గుసగుసలు వినిపించాయి. రాహుల్ కూడా ఎన్నికల ప్రచారాన్ని పూర్తిగా తన భుజాలపై వేసుకుని నిర్వహించారు. అయితే 2014తో పోల్చుకుంటే కాంగ్రెస్ ఏమాత్రం కోలుకోకపోవడంతో బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదని తేల్చేశారు.


ఇక మహారాష్ట్రలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటు అనంతరం ఎన్సీపీ అధినేత శరాద్ పవార్, బీజేపీ వ్యతిరేక కూటమికి బాధ్యత వహిస్తే బాగుంటుందని కొందరు ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయని మరికొందరు ప్రచారం చేశారు. అయితే వాటికి సంబంధించిన వివరాలేవీ బయటికి రాకపోవడంతో అది కూడా ఆటకెక్కింది. ఈ తరుణంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షించాయి. బీజేపీ గెలుపు గురించి పక్కన పెడితే టీఎంసీ మళ్లీ విజయం సాధిస్తే మమతనే కాబోయే ప్రధాని అభ్యర్థి అని ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే మమత ఘన విజయం సాధించారు.


కాగా, మంగళవారం ఓ జాతీయ న్యూస్ ఛానల్‌కు మమతా బెనర్జీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి అభ్యర్థిత్వం గురించి మమతను ప్రశ్నించగా ఇప్పుడప్పుడే దీని గురించి మాట్లాడలేమని, చర్చల తర్వాత నిర్ణయం జరుగుతుందని అన్నారు. ‘‘మూడో ఫ్రంట్ ఉండే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా సంకేతాలు ఇచ్చిన మమత, దానికి సంబంధించిన కార్యాచరణ ఏమీ జరగలేదని తేల్చి చెప్పారు. ఇక ప్రధాన అభ్యర్థిత్వంపై ఆమెకు ఇష్టం లేదని చెప్పలేదు. అలా అని ఇంకొకరు ప్రధాని అభ్యర్థి రేసులో ఉన్నారని కూడా చెప్పలేదు. బెంగాల్‌లో పరిస్థితులు సర్దుకున్నాక మూడో ఫ్రంట్ ఏర్పాటు దిశగా మమత అడుగులు వేస్తారేమో’’ అని కొన్ని ఊహగానాలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2021-05-05T01:03:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising