ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నందిగ్రామ్‌లో ఓడిపోయిన మమతా నైతికంగా సీఎం కాకూడదు...

ABN, First Publish Date - 2021-05-05T14:49:55+05:30

త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్రిపుర సీఎం సంచలన వ్యాఖ్యలు

అగర్తలా (త్రిపుర): త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలైన మమతాబెనర్జీ  నైతికంగా పశ్చిమబెంగాల్ సీఎం కాకూడదని త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్ వ్యాఖ్యానించారు.నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమి పాలైన మమతా బెనర్జీ పార్టీ 213 స్థానాలు గెల్చుకున్నా, నైతికంగా సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేయరాదని విప్లవ్ దేవ్ సూచించారు. బెంగాల్ ఎన్నికల్లో జరిగిన హింసాకాండ వల్లనే బీజేపీ ఓటమి పాలైందని, కాని గతంలో కంటే బీజేపీకి బెంగాల్ రాష్ట్రంలో ఓట్ల శాతం పెరిగిందని సీఎం చెప్పారు.  


‘‘నందిగ్రామ్ లో మమతాబెనర్జీ ఓటమిపాలైనందున నైతికంగా ఆమె సీఎం పదవి చేపట్టరాదు’’ అని విప్లవ్ దేవ్ చెప్పారు. నందిగ్రామ్ లో కుట్ర జరిగిందని మమతాబెనర్జీ ఆరోపించారని, కాని రాష్ట్రంలో టీఎంసీ విజయం వెనుక కూడా కుట్ర జరిగిందేమోనని దేవ్ అనుమానం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-05-05T14:49:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising