ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్న సీఎం మమత

ABN, First Publish Date - 2021-03-05T17:30:24+05:30

సీఎం మమతా బెనర్జీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకున్నారు. శుక్రవారం అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : సీఎం మమతా బెనర్జీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకున్నారు. శుక్రవారం అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. మొత్తం 294 స్థానాల అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తుండటం విశేషం. అయితే ఇందులో ఎక్కువ మంది మహిళలకు, యువకులకు విశేష ప్రాధాన్యం కల్పించారని వార్తలొస్తున్నాయి. రాష్ట్రంలోని యువత బీజేపీ వైపు వెళ్లకుండా కట్టడి చేసే భాగంలోనే ఎక్కువ మంది యువతకు టిక్కెట్లు ఇస్తున్నట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. సీఎం మమతా బెనర్జీ మాత్రం ఈసారి నందిగ్రామ్ నుంచే బరిలోకి దిగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడానికి తృణమూల్ ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమైంది. ముఖ్య నేతలందరితోనూ సీఎం మమత సమావేశమై, వారి ఆలోచనలను, నిర్ణయాలను తీసుకున్నారు. వీటి అనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక కూడా జరిగినట్లు సమాచారం. అయితే 80 సంవత్సరాల వయస్సు పైబడిన వారెవ్వరికీ టిక్కెట్లు ఇవ్వకూడదని అధిష్ఠానం నిర్ణయించుకుంది. దాదాపు 75 మంది సిట్టింగ్‌లకు ఈసారి మమత టిక్కెట్లు ఇవ్వడం లేదని సమాచారం.

Updated Date - 2021-03-05T17:30:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising