ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bhabanipur: భారీభద్రత మధ్య ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ABN, First Publish Date - 2021-09-30T13:37:01+05:30

దేశంలోనే కీలకమైన భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భవానీపూర్ (పశ్చిమబెంగాల్): దేశంలోనే కీలకమైన భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. భారీ సాయుధ బలగాల భద్రత మధ్య భవానీపూర్ సెగ్మెంటులో పోలింగ్ సాగుతోంది.టీఎంసీ అభ్యర్థి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై బీజేపీకి చెందిన న్యాయవాది ప్రియాంక టిబ్రేవాల్ పోటీ పడుతున్నారు. ప్రతిష్ఠాత్మక మైన భవానీపూర్ ఉప ఎన్నికల పోలింగ్ పర్వంలో కేంద్రం 15 కంపెనీల బలగాలను మోహరించింది. 


‘‘కేంద్ర పారామిలటరీ బలగాల బందోబస్తు మధ్య ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, స్వేచ్ఛగా సాగుతోందని భావిస్తున్నాను. నేను పోలింగ్ కేంద్రాలను సందర్శించాను, రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోంది’’ అని బీజేపీ అభ్యర్థిని ప్రియాంక టిబ్రేవాల్ వ్యాఖ్యానించారు. భవానీపూర్ తో పాటు జంగిపూర్, షంషేర్ జంగ్ అసెంబ్లీ స్థానాల్లోనూ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఒడిశా రాష్ట్రంలోని పూరి జిల్లా పిప్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోలింగ్ భారీభద్రత మధ్య సాగుతోంది. 


Updated Date - 2021-09-30T13:37:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising